lifestyle

మార్వాడీల‌ను కోటీశ్వ‌రుల‌ను చేసిన ర‌హ‌స్యం ఇదే.. వారు ఇలా ర‌హ‌స్య పూజ చేస్తారు.. వాటిని మూట‌గా క‌ట్టి పెడితే..?

ప్ర‌స్తుతం మ‌నిషికి డ‌బ్బు ఎంత ఆవ‌శ్య‌కంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. డ‌బ్బు లేక‌పోతే మ‌నిషి ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌పంచం మొత్తం డ‌బ్బు చుట్టూనే తిరుగుతుంది.. అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అయితే డ‌బ్బు విష‌యానికి వ‌స్తే మ‌న‌లో కొంద‌రు ప్ర‌వాహంలా డ‌బ్బు సంపాదిస్తుంటారు. కొంద‌రు సంపాదించ‌లేక‌పోతుంటారు. కానీ మార్వాడీలు మాత్రం బిజినెస్‌లు బాగా చేస్తుంటారు. వారు కోట్ల రూపాయ‌ల‌ను వెన‌కేస్తుంటారు. మ‌నం ఎక్క‌డ చూసినా స‌రే మార్వాడీల బిజినెస్‌లు మంచి లాభాల్లో ఉంటాయి. అయితే ల‌క్ష్మీ దేవి వారినే ఎందుకు క‌టాక్షిస్తుంది.. వారు అంత‌లా డ‌బ్బు ఎలా సంపాదిస్తున్నారు.. వారు చేసే ర‌హ‌స్య పూజా విధానం ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మార్వాడీలు ల‌క్ష్మీ క‌టాక్షం కోసం ప్ర‌త్యేకంగా ర‌హ‌స్య పూజ‌లు చేస్తుంటారు. వారు చేసే పూజ‌లు ఎదుటి వారికి క‌నిపించ‌వు. క‌నుక‌నే ల‌క్ష్మీదేవి వారిని వ‌రిస్తుంది. మార్వాడీలు గుర్ర‌పు నాడాను దోషాలు పోవడానికి ఉప‌యోగిస్తారు. వీటిని షాపుల్లో, ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద బ‌య‌ట లేదా లోప‌ల ఎవ‌రికీ క‌నిపించ‌కుండా వేలాడ‌దీస్తారు. అయితే గుర్ర‌పు నాడాల్లో న‌లుపు అయితే మంచిది. ఎరుపు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇలా గుర్ర‌పు నాడాల‌ను వేలాడ‌దీయ‌డం వ‌ల్ల గాలి, ధూళి లోప‌లికి రావు. న‌ర‌దృష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉంటాయి. దీంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఇలా మార్వాడీలు కోట్ల రూపాయ‌ల బిజినెస్‌ల‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయ‌డం వెనుక ఉన్న బ‌ల‌మైన కార‌ణం ఇదే.

this is the secret to marwadis profits

ఇక మార్వాడీలు చేసే పూజ ఇంకోటి ఉంది. వారు 21 గురువింద గింజ‌ల‌ను ఎరుపు రంగు వ‌స్త్రంలో మూట‌గా క‌ట్టి అమ్మ‌వారి ఎదురుగా ఈశాన్యంలో పెట్టి పూజిస్తారు. ఈ పూజ‌ను శుక్ర‌వారం పూట చేస్తారు. పూజ‌లో భాగంగా కుంకుమార్చ‌న‌, దీపారాధ‌న‌, నైవేద్యం వంటివి చేస్తారు. ఇలా మార్వాడీలు ర‌హ‌స్య పూజ‌ల‌ను నిర్వ‌హిస్తారు. అందువ‌ల్ల మ‌న‌కు ఎక్క‌డ చూసినా వారి బిజినెస్‌లు ఎంతో ఊపు మీద క‌నిపిస్తాయి. క‌నుక ఎవ‌రైనా స‌రే ఇలా పూజ‌లు చేస్తే ఆశించిన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. వ్యాపారంలో వృద్ధి చెందుతారు.

Admin

Recent Posts