వినోదం

Mahesh Babu : మ‌హేష్ బాబు ఒక్క సినిమాకు తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

Mahesh Babu : సూపర్ స్టార్ మ‌హేష్ బాబు తీసిన‌ స‌ర్కారు వారి పాట మూవీ స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే. కానీ త‌రువాత వ‌చ్చిన గుంటూరు కారం మూవీ ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. అయితే ఆయ‌న తీసిన గ‌త నాలుగు చిత్రాలు వ‌రుస‌గా హిట్ అయ్యాయి. భ‌ర‌త్ అనే నేను సినిమాతో మొద‌లు పెడితే.. మ‌హర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు, స‌ర్కారు వారి పాట‌.. మొత్తంగా 4 చిత్రాలు వ‌రుస‌గా హిట్ అయ్యాయి. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఇంకా ఎంతో జోష్‌లో ఉన్నారు. ఇక ఆయ‌న త‌రువాత సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే మ‌హేష్ తీసిన లాస్ట్ 5 చిత్రాల‌లో 4 స‌మాజానికి మెసేజ్ ఇచ్చేవే. దీంతో ఫ్యాన్స్ ఈసారి భిన్న‌మైన క‌థ‌ను ఎంచుకోవాల‌ని కోరుతున్నారు. ఇక ఇప్ప‌టికే ఆయ‌న త‌న నెక్ట్స్‌ సినిమాను కూడా అనౌన్స్ చేసేశారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న సినిమా చేయ‌నున్నారు. అయితే స‌ర్కారు వారి పాట‌కు ఆయ‌న రూ.50 కోట్ల మేర రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే త‌న నెక్ట్స్ సినిమాకు ఆయ‌న రూ.70 కోట్లు డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న అడిగినంత ఇచ్చేందుకు నిర్మాత‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో త్వ‌ర‌లోనే మూవీ ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది.

mahesh babu remuneration for one movie

కాగా ఈ మూవీ 2025 ప్ర‌థ‌మార్థంలో ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది. దీనికి గాను రాజ‌మౌళి తండ్రి విజేయంద్ర ప్ర‌సాద్ ఇప్ప‌టికే క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డారు. ప్ర‌స్తుతం మ‌హేష్ మ‌రోమారు వెకేష‌న్‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చాక ఆ మూవీని ప్రారంభించ‌నున్నార‌ట‌.

Admin

Recent Posts