vastu

ఇంట్లో ఈ చేప బొమ్మ‌ను ఈ దిక్కున పెట్టి దాని నోట్లో ఓ కాయిన్ ఉంచండి.. దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం పోయి సంప‌ద వ‌స్తుంది..!

చాలా మంది ఇళ్ల‌లో అక్వేరియంలు పెట్టి అందులో చేప‌ల‌ను పెంచుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో అక్వేరియంను పెట్టుకోవ‌డం మంచిదే. అక్వేరియంలో చేప‌లు తిరుగుతుండ‌డం వాస్తు ప్ర‌కారం ఇంటికి ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇంట్లో ఉండే దుష్ప్ర‌భావాలు పోతాయి. అంద‌రికీ మంచే జ‌రుగుతుంది.

అయితే అక్వేరియంలో స‌హ‌జంగానే చాలా మంది గోల్డ్ ఫిష్‌ను పెంచుతుంటారు. ఇవి కూడా వాస్తు ప్ర‌కారం మంచి చేస్తాయి. వీటితోపాటు అరోవానా (Arowana) అనే చేప‌ల‌ను కూడా పెంచ‌వచ్చ‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అరోవానా చేప‌ల‌ను అక్వేరియంలో పెంచ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది. ప్ర‌తికూల ప‌రిస్థితులు పోయి అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి.

put a fish like this and keep a coin in its mouth

అరోవానా చేప‌ల‌ను పెంచ‌డం వ‌ల్ల ఇంట్లో ఏమైనా దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం ఉంటే పోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. సంతోషం వెల్లివిరుస్తుంది. ధ‌నం ల‌భిస్తుంది. పేరు ప్ర‌ఖ్యాతులు వ‌స్తాయి.

అయితే అరోవానా చేప‌ల‌ను అక్వేరియంలోనే పెంచాల్సిన ప‌నిలేదు. వాటి బొమ్మ‌ల‌ను తెచ్చి కూడా ఇంట్లో పెట్టుకోవ‌చ్చు. ఆ బొమ్మ నోట్లో ప‌ట్టే క‌రెన్సీ నాణెం ఒక‌దాన్ని పెట్టి దాన్ని ఇంట్లో ఉత్త‌రం దిక్కున లేదా ఈశాన్యం దిక్కున ఉంచాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. అన్నీ శుభాలే క‌లుగుతాయి.

Admin

Recent Posts