వినోదం

Nayanthara : ప్ర‌భుదేవాకు న‌య‌న‌తార అందుకే బ్రేక‌ప్ చెప్పిందా.. ఆ కార‌ణాల వ‌ల్లే వారు విడిపోయారా..?

Nayanthara : నయన తార.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. సినిమాల‌లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న ఈ బ్యూటీ.. సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోనటువంటి నెంబర్ ను రెమ్యూనరేషన్ గా తీసుకుంటోంది. అంతేకాకుండా లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళ‌యాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నటనలో ఎలాంటి క్యారెక్టర్స్ లో నైనా లీనమైపోయే ఈ అమ్మడు గత కొంతకాలంగా ప్రేమించిన డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

తమిళనాడులోని మహాబలిపురంలోని ఓ రెస్టారెంట్ లో చాలా సింపుల్ గా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ విగ్నేశ్ చేత మూడు మూళ్లు వేయించుకుంది. అయితే విగ్నేష్ తో ప్రేమాయ‌ణానికి ముందు న‌య‌న‌తార కొరియోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవాతోనూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. న‌య‌న్ వ‌ల్లే ప్ర‌భుదేవా త‌న భార్య‌కు విడాకులు ఇచ్చాడ‌ని కోలీవుడ్ లో వార్త‌లు వినిపించాయి.

this may be the reason nayanthara and prabhu deva got separated

ఆ స‌మ‌యంలో ప్ర‌భుదేవా భార్య ర‌మ‌ల‌త్ న‌య‌న్‌కు శాప‌నార్థాలు కూడా పెట్టింది. క‌ట్ చేస్తే ప్ర‌భుదేవా, న‌య‌న‌తార బ్రేక‌ప్ చెప్పుకున్నారు. అయితే ప్ర‌భుదేవా.. న‌య‌న‌తార బ్రేక‌ప్ చెప్పుకోవ‌డానికి ప్ర‌భుదేవా పెట్టిన కొన్ని కండిష‌న్స్ కార‌ణమ‌ని తెలుస్తోంది. ప్ర‌భుదేవా పెళ్లి త‌ర‌వాత సినిమాలు వ‌ద్ద‌ని చెప్ప‌డంతో న‌య‌న్ ఓకే చెప్పింద‌ట‌. ఆ త‌ర‌వాత ప్ర‌భుదేవా క్రిస్టియ‌న్ గా ఉన్న న‌య‌న్ ను త‌న మ‌తంలోకి మారాల‌ని కోర‌గా అదికూడా సరే అందట నయనతార.

అలాగే న‌య‌న‌తార ఆస్తులు కొన్ని ప్ర‌భుదేవా పేరుపై ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసింద‌ట‌. ఆ తర‌వాత ప్ర‌భుదేవా ఆధిప‌త్యం చెలాయిస్తూ మ‌రికొన్ని కండిష‌న్స్ పెట్టాడ‌ట‌. ఆ త‌ర్వాత ప్ర‌భుదేవా తీరులో మార్పు రావ‌డంతో విసిగిపోయిన న‌య‌నతార చివరకు బ్రేక‌ప్ చెప్పేసింద‌ట‌. అలా ప్ర‌భుదేవాకు బ్రేక‌ప్ చెప్పిన న‌య‌న్ ప్ర‌స్తుతం విగ్నేష్ శివ‌న్‌తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

Admin

Recent Posts