Tomato Bath Upma : ట‌మాటా బాత్ ఉప్మా.. ఒక్క‌సారి రుచి చూశారంటే.. మొత్తం తినేస్తారు..

Tomato Bath Upma : ఉద‌యం అల్పాహారంగా చేసే వాటిల్లో ఉప్మా కూడా ఒక‌టి. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ ఉప్మాను మ‌రింత రుచిగా మ‌నం ట‌మాట బాత్ ఉప్మాను త‌యారు చేయ‌డ‌వ‌చ్చు. ఎంత రుచిగా ఉన్న‌ప్ప‌టికి ఉప్మాను చాలా మంది ఇష్టంగా తిన‌రు. అలాంటి వారు ఈ ట‌మాట బాత్ ఉప్మాను ఇంకా కావాల‌ని అడిగి మ‌రీ తింటారు. ఈ ట‌మాట బాత్ ఉప్మా అంత రుచిగా ఉంటుంది మ‌రీ. సులభంగా, రుచిగా, చ‌క్క‌గా ట‌మాట బాత్ ఉప్మాను ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాటో బాత్ ఉప్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, జీడి ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక‌టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన‌ప‌చ్చిమిర్చి – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పండు ట‌మాటాలు – 2, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ – 1, వేడి నీటిలో నాన‌బెట్టిన ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, ప‌సుపు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నీళ్లు – 3 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Tomato Bath Upma recipe in telugu this is the method
Tomato Bath Upma

ట‌మాటో బాత్ ఉప్మా త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ర‌వ్వ‌ను వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న త‌రువాత ర‌వ్వ‌ను ఒక గిన్నెలోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. ఇవి వేడ‌య్యాక జీడిప‌ప్పును వేసి ఎర్ర‌గా అయ్యే వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో శ‌న‌గ‌ప‌ప్పు, జీడిప‌ప్పు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు పూర్తిగా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత క్యారెట్ ముక్క‌లు, ప‌చ్చి బ‌ఠానీ వేసి వేయించాలి. క్యారెట్ ముక్క‌లు కొద్దిగా వేగిన త‌రువాత క‌రివేపాకు, ప‌సుపు వేసి వేయించాలి. క్యారెట్ ను అలాగే ప‌చ్చి బ‌ఠాణీని 80 శాతం వ‌ర‌కు వేయించిన త‌రువాత ఇందులో నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత త‌గినంత ఉప్పును వేసి నీటిని మ‌రిగించాలి.

నీళ్లు మ‌రిగిన త‌రువాత వేయించిన ర‌వ్వ‌ను కొద్ది కొద్దిగా వేస్తూ ఉండ‌లు లేకుండాక‌లుపుకోవాలి. దీనిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర త‌రుగు, మ‌రో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, వేయించిన జీడిప‌ప్పు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట బాత్ ఉప్మా త‌యార‌వుతుంది. దీనిని ఉద‌యం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా వండుకుని తిన‌వ‌చ్చు. త‌ర‌చూ చేసే ఉప్మా కంటే ఈ విధంగా చేసిన ట‌మాట బాత్ ఉప్మా మ‌రింత రుచిగా ఉంటుంది. ఉప్మాను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా దీనిని వ‌దిలి పెట్ట‌కుండా ఇష్టంగా తింటారు.

D

Recent Posts