Golden Milk : ప్రస్తుత కాలంలో మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ఇలా అనారోగ్య సమస్య తలెత్తగానే చాలా మంది వైద్యున్ని సంప్రదించి మందులను వాడుతూ ఉంటారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా మందులు వాడడం నేటి తరుణంలో అందరికి అలవాటుగా మారిపోయింది. మందులను వాడడం వల్ల ఉపశమనం కలిగినప్పటికి వాటి వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అసలు పూర్వకాలంలో ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు లేవు. అలాగే వారు సమస్య తలెత్తగానే మందులను వాడే వారు కూడా కాదు. మన పూర్వీకులు ఎక్కువగా ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించే వారు. ఆయుర్వేదాన్ని వాడడం వల్ల మనం ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా ఉంటాము. మనం తీసుకునే ఆహార పదార్థాలనే మన పూర్వీకులు ఔషధంగా ఉపయోగించే వారు.
ఒక్కో ఆహార పదార్థం కొన్ని వందల రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అలాంటిదే మన వంట గదిలో ఉండే పసుపు. ప్రతిరోజూ పసుపు వేసి చేసిన పాలను తాగడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో తలనొప్పి రాగానే అందరూ తలనొప్పిని తగ్గించే మందులను వేసుకుంటున్నారు. ఈ మందు కేవలం తలనొప్పి మాత్రమే తగ్గిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలను నయం చేయదు. అలాగే ఒక్కో అనారోగ్య సమస్యకు కూడా పది రకాల మందులను వాడాల్సి వస్తుంది. కానీ మనం ఒక్క పసుపు పాలను ఉపయోగించి అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పసుపు పాలను తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు పాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. అలాగే ముఖం పై వచ్చే మొటిమలను, మచ్చలను, ముడతల వంటి వాటిని అలాగే కీళ్ల నొప్పులను, కీళ్ల వాపులను, జీర్ణ సంబంధిత సమస్యలను, నిద్రలేమి ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అసలు ఈ పసుపు పాలను ఎలా తయారు చేసుకోవాలి… వాటిని ఎప్పుడు తాగాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నేటి కాలంలో వివిధ రకాల కృత్రిమ రంగులు కలిపి పసుపును కూడా కల్తీ చేస్తున్నారు. కనుక ఈ పసుపు పాలను తయారు చేసుకోవడానికి గానూ మనం పచ్చి పసుపు కొమ్ముల నుండి తీసిన పసుపు కానీ, ఆర్గానిక్ పసుపును లేదా కస్తూరి పసుపును మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే మనం అధిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను, పావు టీ స్పూన్ పసుపును వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి.
తరువాత వీటిని ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను కలపాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు తేనెను ఉపయోగించకపోయిన ఎటువంటి నష్టం లేదు. తేనె ఇష్టం లేని వారు ఇందులో బెల్లాన్ని కూడా కలుపుకోవచ్చు. అయితే పంచదారను మాత్రం కలుపుకోకూడదు. ఇలా తయారు చేసిన పసుపు పాలను రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తాగాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు ఇలా రెండు నుండి మూడు నెలల పాటు పసుపు పాలను తాగడం వల్ల క్రమంగా షుగర్ వ్యాధి కూడా నియంత్రణలోకి వస్తుంది. అలాగే ఈ పసుపు పాలను తాగడం వల్ల భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది.
ఈ పాలను తాగడం వల్ల చర్మ సమస్యలు అన్ని తగ్గిపోయి చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. వృద్ధాప్య ఛాయలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారు ఈ విధంగా పసుపు కలిపిన పాలను తాగడం వల్ల నొప్పులు, వాపులు క్రమంగా తగ్గుతాయి. పసుపులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే పాలల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ పసుపు పాలను తీసుకోవడం వల్ల ఎముకలు గట్టి పడడంతో పాటు నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. ఈ పసుపు పాలను తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడే వారు ఈ పసుపు పాలను తాగడం వల్ల రోగ నిరోధక శక్తిపెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.
ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడి, ఆందోళన కారణంగా నిద్రలేమి సమస్య బారిన పడుతున్నారు. అలాంటి వారు ఈ పాలను రోజూ రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి చక్కగా నిద్ర పడుతుంది. అలాగే ఈ పాలను తాగడం వల్ల అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు కూడా ఈ పాలను రోజూ తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఈ విధంగా పసుపు పాలు మనకు ఎంతో మేలు చేస్తాయని ఇవే కాకుండా మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.