Health Tips : తొలిరాత్రికి ఒక‌టి లేదా రెండు రోజుల ముందు.. నూత‌న దంప‌తులు వీటిని తీసుకుంటే.. ఇక అస‌లు ఆ విష‌యం చెప్ప‌లేరు..!

Health Tips : దంప‌తుల‌కు ఎవ‌రికి అయినా స‌రే తొలి రాత్రి అంటే కాస్త బిడియం, బెరుకు అన్నీ ఉంటాయి. జీవితంలో ఏ దంప‌తులు అయినా స‌రే త‌మ‌కు తొలిరాత్రి మ‌ధురానుభూతుల‌ను పంచాల‌ని కోరుకుంటారు. పెళ్లితో రెండు మ‌న‌స్సులు ఒక‌ట‌య్యాక‌.. తొలిరాత్రితో రెండు శ‌రీరాలు ఒక‌ట‌వుతాయి. అదొక ప‌విత్ర కార్యం. అయితే తొలి రాత్రి రోజు స‌హ‌జంగానే దంప‌తుల‌కు కంగారు, ఆందోళ‌న ఉంటాయి. దీనికి తోడు అస‌లు కార్యంలో పాల్గొంటామా లేదా అని అనిపిస్తుంది. అయితే ఈ భ‌యాల‌న్నీ ప‌క్క‌న పెడితే.. ఆరోగ్యంగా దృఢంగా ఉన్న‌ప్పుడే కార్యం స‌రిగ్గా జ‌రుగుతుంది. లేదంటే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ క్ర‌మంలోనే తొలిరాత్రిలో పాల్గొన‌బోయే నూత‌న దంప‌తులు కొన్ని ర‌కాల ఆహారాల‌ను ముందే తినాల్సి ఉంటుంది. క‌నీసం ఒక రోజు ముందైనా ఈ ఆహారాల‌ను తింటే.. అస‌లు కార్యంలో ఎంతో చురుగ్గా పాల్గొంటారు. జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకుంటారు. ఇక నూత‌న దంప‌తులు తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తొలిరాత్రి మ‌రిచిపోలేనిదిగా ఉండాల‌ని.. కార్యంలో చురుగ్గా పాల్గొనాల‌ని కోరుకునే దంప‌తులు ముందు రోజు మంచి పోష‌కాలు క‌లిగిన బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని తీసుకోవాలి. వాటిల్లో బాదంప‌ప్పు ముందు వ‌రుస‌లో నిలుస్తాయి. బాదంప‌ప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి జ‌న‌నావ‌య‌వాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. దీంతో ఆ అవ‌య‌వాలు ఉత్తేజం చెందుతాయి. ఈ క్ర‌మంలో ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే బాదంప‌ప్పుతోపాటు పిస్తాప‌ప్పును కూడా తీసుకోవ‌చ్చు. వీటిల్లోనూ విట‌మిన్ ఇ ఉంటుంది. ఇది శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతుంది.

Health Tips must take these foods for nutrition
Health Tips

నూత‌న దంప‌తులు తొలి రాత్రి ముందు తీసుకోవాల్సిన ఆహారాల్లో కొబ్బ‌రి కూడా ఒక‌టి. ప‌చ్చి లేదా ఎండు కొబ్బ‌రిల‌లో దేన్న‌యినా తిన‌వ‌చ్చు. దీంతో ప‌డ‌క‌గ‌దిలో ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. ఇక మున‌గ‌కాయ‌ల‌ను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల దంప‌తులు ఆ కార్యంలో రెచ్చిపోతారు. ఇవే కాకుండా యాల‌కులు, పుచ్చ‌కాయ‌, కోడిగుడ్డు, బ్రౌన్ రైస్ వంటి వాటిని కూడా తిన‌వ‌చ్చు. వీటిల్లో అధికంగా ఉండే జింక్ శృంగార స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. శృంగారంలో చురుగ్గా పాల్గొనేలా చేస్తుంది. అలాగే క్యారెట్‌, ట‌మాటా, ఉసిరి వంటి ఆహారాల‌ను కూడా తొలి రాత్రికి ముందు తీసుకోవాలి. క‌నీసం ఒక‌టి లేదా రెండు రోజుల ముందు వీటిని తింటే తొలిరాత్రి ఎలాంటి భ‌యం ఉండ‌దు. సాఫీగా అంతా సాగిపోతుంది. ఆ రాత్రి జీవితాంతం గుర్తుంటుంది.

Share
Editor

Recent Posts