Tomato Pappu : ట‌మాటా ప‌ప్పును ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Tomato Pappu : మ‌నం వంటింట్లో పప్పు కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పు కూర అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ట‌మాట ప‌ప్పు. ట‌మ‌టా ప‌ప్పును రుచి చూడ‌ని వారు ఉండ‌రు. వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు చాలా మంది త్వ‌ర‌గా అవుతుంద‌ని ఈ టమాట ప‌ప్పునే త‌యారు చేస్తూ ఉంటారు. రుచిగా ఉండే ఈ ట‌మాట ప‌ప్పును మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన కందిప‌ప్పు – 150 గ్రాములు, పెద్ద‌గా త‌రిగిన ట‌మాటాలు – 4 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), పెద్ద‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – 10 గ్రాములు.

Tomato Pappu here it is how to make it more delicious
Tomato Pappu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – రెండు టేబుల్ స్పూన్స్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, మిన‌ప ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

ట‌మాట ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా ఒక కుక్క‌ర్ ను తీసుకుని అందులో నాన‌బెట్టిన కందిప‌ప్పును శుభ్రంగా క‌డిగి వేయాలి. త‌రువాత చింత‌పండు గుజ్జు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న త‌రువాత మూత తీసి ప‌ప్పును గంటెతో లేదా ప‌ప్పు గుత్తితో మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత చింత‌పండు గుజ్జును వేసి కుక్క‌ర్ ను స్ట‌వ్ మీద ఉంచి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ప‌ప్పును ఉడికిస్తూనే మ‌రో క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత కొత్తిమీర త‌ప్ప తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి.

తాళింపు వేగిన త‌రువాత దీనిని ఉడుకుతున్న పప్పులో వేసి మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ప‌ప్పు త‌యార‌వుతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో ఇలా త‌యారు చేసుకున్న ట‌మాట ప‌ప్పును వేసి క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ట‌మాట ప‌ప్పును కేవ‌లం అన్నంతోనే కాకుండా చ‌పాతీ, పుల్కా వంటి వాటితో కూడా క‌లిపి తినవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాట ప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

D

Recent Posts