Tomato Perugu Pachadi : రుచిక‌ర‌మైన ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా తింటారు..

Tomato Perugu Pachadi : మ‌నం పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. జీర్ణ శ‌క్తిని పెంచ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో, జుట్టును, చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో పెరుగు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. మెద‌డును, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా పెరుగు ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంతోపాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా పెరుగు దోహ‌ద‌ప‌డుతంది. మ‌నం ఎక్కువ‌గా పెరుగును నేరుగా లేదా మ‌జ్జిగ‌, ల‌స్సీ మాదిరిగా త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. వివిధ ర‌కాల కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేయ‌డంలో కూడా పెరుగును వాడుతూ ఉంటాం. పెరుగుతో త‌యారు చేసే ప‌చ్చ‌ళ‌ల్లో ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డి ఒక‌టి. ఈ ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Tomato Perugu Pachadi make in this way very tasty
Tomato Perugu Pachadi

ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన‌ ప‌దార్థాలు..

త‌రిగిన ట‌మాటాలు – పావు కిలో, ప‌చ్చి మిరప‌కాయ‌లు – 10, పెరుగు – అర క‌ప్పు, చింత‌పండు – 10గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 5, జీల‌క‌ర్ర – ఒకటిన్న‌ర టేబుల్ స్పూన్‌, ఆవాలు – అర టీ స్పూన్‌, శ‌న‌గ ప‌ప్పు – అర టీ స్పూన్‌, ఎండు మిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక త‌రిగిన ట‌మాటాలు, రుచికి స‌రిప‌డా ఉప్పు, చింత‌పండు వేసి క‌లుపుకోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై ట‌మాటాల‌ను పూర్తిగా ఉడికించుకోవాలి. ట‌మాటాల‌లోని నీరు అంతా పోయే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఉడికించుకున్న ట‌మాటా మిశ్ర‌మం, ఒక టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు, త‌రిగిన కొత్తిమీర వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి.

ఇలా మిక్సీ ప‌ట్టుకున్న మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్ర‌మంలోనే పెరుగును వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఒక చిన్న క‌ళాయిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, ఎండు మిర్చి, శ‌న‌గ‌ప‌ప్పు, క‌రివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగాక ముందుగా పెరుగు క‌లిపి పెట్టుకున్న మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డిని వేడి వేడి అన్నం, దోశ‌, ఊత‌ప్పం, ఉప్మా వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Share
Admin

Recent Posts