Weight Loss : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువుతో బాధడుతున్నారు. అధిక బరువు వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ అధిక బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. త్వరగా బరువు తగ్గాలని అందరూ అనుకుంటూ ఉంటారు. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు కచ్చితమైన ఆహార నియమాలను కలిగి ఉండాలి. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఈ ఆహార నియమాలు ఏమిటి.. వాటిని ఎలా పాటించాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.బరువు తగ్గాలనుకునే వారు సాయంత్రం భోజనాన్ని 6 నుండి 7 గంటలలోపు చేయాలి. అలాగే కేవలం పండ్లను మాత్రమే తినాలి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. పండ్లల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటి ద్వారా వచ్చే శక్తి రాత్రి పడుకునే వరకు సరిపోతుంది. రాత్రి నుండి తెల్లవారే వరకు కావల్సిన శక్తి కోసం శరీరం కొవ్వును కరిగించి దాని నుండి శక్తిని పొందుతుంది.
2. వేగంగా బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం భోజనంలో కేవలం రెండు పుల్కాలను ఒకటి లేదా రెండు కూరలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఈ కూరలను కూడా తక్కువ నూనె, ఉప్పు లను ఉపయోగించి తయారు చేసుకోవాలి. కూరగాయలు, ఆకు కూరలల్లో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి . కనుక త్వరగా బరువు తగ్గడంతోపాటు శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ అందుతాయి.
3. ఉదయం అల్పాహారంలో 8 నుండి 9 గంటల మధ్య కేవలం మొలకెత్తిన విత్తనాలను, పండ్లను ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభించడంతోపాటు ఆరోగ్యంగా తక్కువ సమయంలోనే ఎక్కువగా బరువు తగ్గవచ్చు.
ఇలా 3 సూచనలు పాటిస్తే.. తక్కువ సమయంలోనే ఎక్కువగా బరువు తగ్గుతారు. ఆరోగ్యవంతమైన రీతిలో బరువు తగ్గుతారు. కనుక ఎలాంటి దుష్ర్పభావాలు కలగవు.