Tomato Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే ట‌మాటా రైస్‌ను ఇలా చేసి తినొచ్చు.. క్ష‌ణాల్లో అవుతుంది..!

Tomato Rice : ట‌మాటాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌న ఆరోగ్యానికి, అందానికి ట‌మాట‌లు ఎంతో మేలు చేస్తాయి. ట‌మాటాల‌ను మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. కూర‌లే కాకుండా ట‌మాటాల‌తో మ‌నం ట‌మాట రైస్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ ట‌మాట రైస్ ను మ‌రింత రుచిగా, చ‌క్క‌గా ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – పావు కిలో బియ్యంతో వండినంత‌, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, ట‌మాటాలు – 3, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, జాప‌త్రి – 1, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌.

Tomato Rice recipe in telugu make in this method
Tomato Rice

ట‌మాట రైస్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ట‌మాటాలను తీసుకుని అవి మునిగే వ‌ర‌కు నీటిని పోసి ట‌మాటాల‌ను మెత్త‌గా ఉడికించుకోవాలి. ట‌మాటాలు ఉడికిన త‌రువాత వాటిపై ఉండే పొట్టును తీసి ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని మెత్త‌నిపేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత జీడిప‌ప్పు, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట ఫ్యూరీ, ట‌మాట ముక్క‌లు, క‌రివేపాకు, ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి.

ఇలా వేయించిన త‌రువాత దీనిలో అన్నాన్ని వేసి క‌లుపుకోవాలి. అంతా క‌లిసేలా దీనిని 5 నిమిషాల పాటు బాగా క‌లుపుకోవాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట రైస్ త‌యార‌వుతుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా ట‌మాట రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ట‌మాట రైస్ ను నేరుగా ఇలాగే తిన‌వ‌చ్చు లేదా రైతాతో క‌లిపి తిన‌వ‌చ్చు. దీనిని ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts