మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన 40 ఏళ్లుగా టాలీవుడ్‌లో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయనే నంబర్ వన్ హీరోగా ఉన్నారు. ఈయనకు పోటీ ఎవరూ లేరనే చెప్పవచ్చు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కష్టపడి స్వయం కృషితో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు. పునాదిరాళ్లు అనే మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన అంచలంచెలుగా ఎదిగారు. ఈ వయస్సులోనూ ఈయనే నంబర్ వన్ హీరోగా ఉన్నారు. అయితే 10 ఏళ్ల పాటు రాజకీయాల వల్ల సినిమాలకు దూరమైనా మళ్లీ ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనలో ఇంకా యాక్టింగ్ పవర్ ఉందని నిరూపించారు.
ఈ వయస్సులోనే చిరంజీవి చేసే డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. యంగ్ హీరోలకు దీటుగా ఆయన డ్యాన్స్ స్టెప్స్ వేస్తుంటారు. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే చిరంజీవి తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. అప్పట్లో ఆయన మాధవి, రాధిక, రాధ, విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ, రోజా వంటి హీరోయిన్లతో నటించారు. తరువాత సాక్షి శివానంద్, సిమ్రాన్, ఇప్పుడు కాజల్, నయనతార, తమన్నా.. ఇలా మూడు తరాల హీరోయిన్లను కవర్ చేశారు. అయితే చిరంజీవి తన కెరీర్ లో ఎన్నడూ వివాదాల్లో చిక్కుకోలేదు. అలాగే ఏ హీరోయిన్‌తోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. చాలా హుందాగా ఉండేవారు. కానీ ఒక మూవీ షూటింగ్‌లో ఆయన కోసం ఇద్దరు హీరోయిన్లు కొట్టుకున్నారట. అయితే నిజంగా కాదులెండి. అదంతా ఫన్నీగానే సాగింది. ఇంతకీ అది ఏ సినిమా అంటే..
అప్పట్లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో చేసిన ఇంద్ర మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2002 జూలై 24వ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇందులో చిరుకు జోడీగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రెలు హీరోయిన్లుగా నటించారు. అయితే చివర్లో ఒక సీన్ ఉంటుంది. క్లైమాక్స్‌లో ఆర్తి అగర్వాల్, సోనాలిలు చిరంజీవి కోసం పోట్లాడుకుంటారు. ఆయన నాకే భర్త అవుతాడంటే.. కాదు నాకే భర్త అవుతాడు.. అంటూ ఇద్దరూ పోట్లాడుకుంటారు. అయితే వాస్తవానికి అక్కడ చిన్న ఫన్నీ గొడవ జరిగిందట.
ఆర్తి అగర్వాల్ తననే ఇంద్ర పెళ్లి చేసుకున్నట్లు చూపించాలని దర్శకున్ని కోరగా.. సోనాలి కూడా తనకే తాళి కట్టినట్లు క్లైమాక్స్‌ను ముగించాలని దర్శకున్ని కోరిందట. దీంతో ఇద్దరూ ఈ విషయంలో ఫన్నీగా గొడవపడ్డారట. అయితే ఇలా కాకుండా ఇంద్ర అనే వ్యక్తి ప్రజల మనిషి అని చెబుతూ ముగింపును ఇస్తారు. ఇలా క్లైమాక్స్‌ను తెరకెక్కించారు. దీంతో ఇద్దరు హీరోయిన్ల మధ్య గొడవ ముగుస్తుంది. అయితే ఆ షూటింగ్‌లో జరిగిన ఆ సంఘటనను మెగాస్టార్ ఇప్పటికీ చెబుతూ నవ్విస్తుంటారు.