Ubbu Rotti : గోధుమ పిండి, మైదా, నూనె లేకుండా.. ఎంతో మెత్త‌గా చేసుకునే ఉబ్బు రొట్టి.. త‌యారీ ఇలా..!

Ubbu Rotti : మ‌నం సాధార‌ణంగా రోటీల‌ను గోధుమ‌పిండి, మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా చేసే ఈ రోటీలో మెత్త‌గా, రుచిగా ఉంటాయి. వీటితో పాటు మ‌నం బియ్యం పిండితో కూడా రోటీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యంపిండితో చేసే ఈ ఉబ్బు రోటీలు కూడా చాలా మెత్త‌గా, రుచిగా ఉంటాయి. అలాగే ఈ రోటీలు చ‌క్క‌గా పొంగుతాయి కూడా. ఈ రోటీల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎప్పుడూ ఒకేర‌కం రోటీలు కాకుండా ఇలా వెరైటీగా ఉబ్బు రోటీల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మెత్త‌గా, రుచిగా ఉండే ఉబ్బు రోటీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉబ్బు రోటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక‌టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – రెండు క‌ప్పులు, బియ్యం పిండి – ఒక‌టిన్న‌ర క‌ప్పులు.

Ubbu Rotti recipe in telugu make in this method
Ubbu Rotti

ఉబ్బు రోటి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యంపిండి వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మూత పెట్టి చ‌ల్లార‌నివ్వాలి. పిండి చ‌ల్లారిన త‌రువాత నొక్కుతూ బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ రోటీని పెనం మీద వేసి అర నిమిషం పాటు రెండు వైపులా కాల్చుకోవాలి. త‌రువాత ఈ రోటీని పుల్కాల పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఈ రోటీని రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, మెత్త‌గా ఉండే ఉబ్బు రోటీలు తయార‌వుతాయి. వీటిని వెజ్ నాన్ వెజ్ కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

D

Recent Posts