Uday Kiran : అంద‌రూ న‌న్ను దూరం పెట్టేశారు.. కంట‌త‌డి పెట్టిస్తున్న ఉదయ్ కిర‌ణ్ లేఖ‌..

Uday Kiran : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన న‌టుడు ఉద‌య్ కిర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ల‌వ్ సినిమాల‌కు ఉద‌య్ కిర‌ణ్ పెట్టింది పేరు. ఆయ‌న న‌టించిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. అయితే ఎంతో మంది ఫ్యాన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్న ఉద‌య్ కిర‌ణ్ తన జీవితాన్ని అర్థాంత‌రంగా ముగించేశాడు. యావ‌త్ సినీ ప్రేక్ష‌కుల‌ను శోక సంద్రంలోకి నెట్టేశాడు. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ ను ఇప్ప‌టికీ ఫ్యాన్స్ అభిమానిస్తూనే ఉంటారు. ఆయ‌న సినిమాలు వ‌స్తుంటే అలాగే క‌న్నార్ప‌కుండా చూస్తుంటారు. ఇక అప్ప‌ట్లో ఉద‌య్ కిర‌ణ్ త‌న స్వ‌దస్తూరితో రాసిన ఒక లెట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అందులో ఉన్న సారాంశం ఇదీ..

Uday Kiran last letter viral in social media
Uday Kiran

విషితా నీతో చాలా చెప్పాలని ఉంది. మా అమ్మను ఎంతగా ప్రేమించానో నిన్ను కూడా అంతే ప్రేమించాను. కానీ నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు ? ఒకప్పుడు నాకు అందరూ ఉండే వాళ్ళు. ఇప్పుడు నువ్వు తప్పించి నాకు ఎవరూ లేరు. సినిమా పిచ్చితో సినిమా పరిశ్రమకు వచ్చాను. కానీ ఈ సినిమా పరిశ్రమ నన్ను పిచ్చి వాడిని చేసి ఆడుకుంది. నీకు ఇచ్చిన మాట నేరవేర్చలేకపోతున్నాను.

ఈ రోజు ఫోన్ చేస్తా అని చెప్పిన ప్రొడ్యూసర్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. అందరికీ నేను పనికి రాని వాడిని అయ్యానా ? నిజమేనేమో. అందుకే అందరూ నన్ను దూరం పెట్టేశారు. నీతో సహా. విషీ నన్ను నమ్ము. వాడు నిజంగా మంచి వాడు కాదు. అయినా ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. దేర్ విల్ బీ ఎ డే. ఆ రోజు నా మాటలు, నా బాధ నీకు కూడా అర్థమవుతాయి. కానీ ఆ రోజు నీ పక్కన నీ ఉదయ్ ఉండడు. నువ్వు ఎంత ఏడ్చినా తిరిగి రాలేడు. అనవసరంగా మన గొడవలతో అత్తమామలు ఇబ్బంది పడుతున్నారు.

అది నాకు ఇష్టం లేదు. అందరికీ నాతోనే కదా బాధ అంతా. ఇక మీ ఎవరికీ ఈ బాధ ఉండదు. ప్రతీ దానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఈ రోజుతో నాది అయిపోయింది. ఒకసారి యూఎస్ వెళ్లి వైద్యం చేయించుకో. ప్లీజ్. మా అమ్మ నగలు మా అక్కకు ఇచ్చేయి. అలా అయినా మా అమ్మ జ్ఞాపకాలు మా అక్క దగ్గర ఉంటాయి. అమ్మా.. నాకు ఎవరు లేరు. అమ్మా.. నువ్వు తప్పించి. ఒకసారి నిన్ను గట్టిగా పట్టుకుని ఏడవాలని ఉంది. అందుకే నీ దగ్గరకు వచ్చేస్తున్నా. లవ్ యూ విషీ. లవ్ యూ ఫరెవర్.

కాగా ఉద‌య్ కిర‌ణ్ జ‌న‌వ‌రి 5, 2014న ఆత్మహ‌త్య చేసుకుని చ‌నిపోయిన విషయం విదిత‌మే. ఆయ‌న భార్య విషితా కిర‌ణ్‌.. కాగా పైన లెట‌ర్ చూస్తుంటే ఉద‌య్ కిర‌ణ్ తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటానికి ముందు ఆ లెట‌ర్‌ను త‌న భార్య‌కు రాసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Editor

Recent Posts