Hair Growth : ఇంట్లోనే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన హెయిర్ కండిష‌న‌ర్‌ను త‌యారు చేసి వాడండి.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది..

Hair Growth : జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందికి ఉంటోంది. స్త్రీలు, పురుషులు ఇరువురూ ఈ స‌మ‌స్య‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. దీనికి తోడు చుండ్రు, జుట్టు చిట్లిపోవ‌డం వంటి ఇత‌ర జుట్టు స‌మ‌స్య‌లు కూడా చాలా మందికి ఉంటున్నాయి. అయితే వీట‌న్నింటికీ కింద తెలిపిన చిట్కాతో చెక్ పెట్ట‌వ‌చ్చు. మీ ఇంట్లోనే కింద తెలిపిన విధంగా ఓ స‌హ‌జ‌సిద్ధ‌మైన హెయిర్ కండిష‌న‌ర్‌ను మీ ఇంట్లోనే త‌యారు చేసుకుని త‌ర‌చూ వాడ‌వ‌చ్చు. దీంతో అన్ని ర‌కాల జుట్టు స‌మస్య‌లు పోతాయి. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది. మ‌రి ఆ కండిష‌న‌ర్‌ను ఎలా త‌యారు చేయాలంటే..

make this natural hair conditioner at home for Hair Growth
Hair Growth

బాగా పండిన ఒక అర‌టి పండు, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌, 1 టేబుల్ స్పూన్ తేనెల‌ను తీసుకోవాలి. అర‌టి పండు గుజ్జు తీసి అందులో ఆలివ్ ఆయిల్‌, తేనె క‌ల‌పాలి. బాగా క‌లిపిన మిశ్ర‌మాన్ని త‌ల‌కు బాగా ప‌ట్టించాలి. జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా రాయాలి. త‌రువాత 30 నిమిషాల పాటు ఉండాలి. అనంత‌రం త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో ఒక‌సారి చేస్తే చాలు.. అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి.

పైన తెలిపిన విధంగా స‌హ‌జ‌సిద్ధ‌మైన హెయిర్ కండిష‌నర్‌ను త‌యారు చేసి వాడ‌డం వ‌ల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలే స‌మ‌స్య త‌గ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. జుట్టు చిట్లిపోకుండా కాంతివంతంగా మారుతుంది. ఇక శిరోజాలు పొడ‌వుగా పెరుగుతాయి. ఎక్కువ పొడ‌వుగా శిరోజాలు పెర‌గాల‌ని కోరుకునేవారు ఈ హెయిర్ కండిష‌న‌ర్‌ను వాడితే మంచి ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు.

Admin

Recent Posts