Vanilla Ice Cream : ఐస్ క్రీమ్.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. మనకు ఐస్ క్రీమ్ ఎక్కువగా బేకరీల్లో, షాపుల్లో లభిస్తూ ఉంటుంది. అలాగే మనకు వివిధ రుచుల్లో ఈ ఐస్ క్రీమ్ లభిస్తూ ఉంటుంది. మనకు విరివిరిగా లభించే ఐస్ క్రీమ్ వెరైటీస్ లో వెనీలా ఐస్ క్రీమ్ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అచ్చం బయట లభించే విధంగా ఉండే ఈ వెనీలా ఐస్ క్రీమ్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అదే రుచితో అదే స్మూత్ నెస్ తో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెనీలా ఐస్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
విప్పింగ్ క్రీమ్ – ఒకటిన్నర కప్పులు, , కండెన్డ్స్ మిల్క్ – ముప్పావు కప్పు, పాల పొడి – పావు కప్పు, వెనీలా ఎస్ట్రాక్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, కాచి చల్లార్చి గంట పాటు ఫ్రిజ్ లో ఉంచిన చల్లటి చిక్కటి పాలు – పావు లీటర్.
వెనీలా ఐస్ క్రీమ్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. తరువాత దీనిని బీటర్ తో స్మూత్ గా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. తరువాత పాల పొడి, వెనీలా ఎస్ట్రాక్ట్, పాలు పోసి మరలా బీటర్ తో బీట్ చేసుకోవాలి. దీనిని సిల్కీ స్మూత్ లా అయ్యే వరకు బీట్ చేసుకున్న తరువాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పోసి మూత పెట్టుకోవాలి. తరువాత దీనిని రాత్రంతా చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫ్రీజర్ లో ఉంచాలి. ఇలా ఫ్రీజర్ లో ఉంచినప్పుడు ఎక్కువగా ఫ్రిజ్ డోర్ తీయకుండా ఉంచాలి. ఇలా రాత్రంతా ఉంచిన తరువాత మరుసటి రోజు దీనిని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, స్మూత్ గా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ తయారవుతుంది. బయట కొనుగోలు చేసే పని ఏలకుండా ఇంట్లోనే ఈ విధంగా ఐస్ క్రీమ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.