Vankaya Masala Curry : వంట‌రాని వారు కూడా వంకాయ మ‌సాలా క‌ర్రీని ఇలా సుల‌భంగా చేసేయ‌వ‌చ్చు..!

Vankaya Masala Curry : వంకాయ‌ల‌ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వంకాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే ఎటువంటి కూరైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ఫంక్ష‌న్స్ లో చేసే విధంగా వంకాయ మ‌సాలా కూర‌ను ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వంకాయ‌లు – పావు కిలో, త‌రిగిన ఉల్లిపాయ – 1,త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ట‌మాట – 1, అల్లం – 2 ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బలు – 10, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 1, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Vankaya Masala Curry recipe in telugu very easy to make
Vankaya Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2.

వంకాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను శుబ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. వీటిని ఉప్పు నీటిలో వేసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి దోర‌గా వేయించుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ‌లు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వంకాయ ముక్క‌లు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి.

వంకాయ ముక్క‌లు వేగిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలాపేస్ట్ వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ఒక గ్లాస్ నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, బ‌గారా అన్నం, మ‌సాలా అన్నం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన వంకాయ కూర‌ను కూడా అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts