Varalaxmi Sarathkumar : సెలబ్రిటీలు తమకు వచ్చే అవకాశాలను బట్టి సహజంగానే ప్రాంతాలు మారుతుంటారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నిన్న మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉండేది. కానీ బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఈమె ముంబైకి షిఫ్ట్ అయింది. పూజా హెగ్డె పరిస్థితి కూడా అంతే. అయితే తమిళంలో కన్నా తెలుగులోనే అవకాశాలు ఎక్కువగా దక్కించుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. చెన్నైలో ఉండే ఈమె టాలీవుడ్‌లో బాగా నటిస్తోంది. అందుకనే అక్కడ ఉంటే కుదరదని చెప్పి ఇప్పుడు తన మకాంను హైదరాబాద్‌కు మార్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టింది.
కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు తెలుగులోనే ఆఫర్లు వస్తున్నాయి. ఆమె విలనిజంకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె నటన ఎందరికో నచ్చింది. ఆమె నటించిన సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. అందుకనే ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆమె తెలుగులో నటించిన తెనాలి రామకృష్ణ చిత్రం మొదటిది. ఈ మూవీ ఫెయిల్ అయినా.. ఈమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.
ఇక ఆ తరువాత రవితేజ సినిమా క్రాక్‌లో జయమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించి మంచి గుర్తింపు పొందింది. దీంతో ఆమె చేతిలో ప్రస్తుతం పుష్కలంగా సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈమె అటు తమిళం కన్నా ఇటు తెలుగులోనే ఎక్కువ బిజీ అయింది. అందుకనే ఈమె హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. ఇక ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. అందులో ఆమె ఒక పోస్టు పెట్టింది.
నా జీవితంలో ఇది బెస్ట్ బర్త్ డే. నాకు బర్త్ డే విషెస్ చెప్పిన అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రత్యేకమైన రోజున నేనొక నిర్ణయం తీసుకున్నా. ఎన్నో రోజులుగా హైదరాబాద్ కు మారాలని అనుకుంటున్నా. అది ఇప్పుడు నెరవేరింది. మొదట్లో భయంగా ఉండేది. కానీ ఇప్పుడు కాస్త శాంతించా. అంతా మంచే జరుగుతుందని కోరుకుంటున్నా.. నాకు మీరందరూ తోడుగా ఉంటారని భావిస్తున్నా.. మీరే నా కుటుంబం.. మీ ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ కావాలి.. అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ పోస్ట్ పెట్టింది.