Anasuya Bharadwaj : మగాళ్లందరూ ఒకేలా ఉండరు అనసూయ.. పొరపాటు పడ్డావ్‌..!

Anasuya Bharadwaj : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు.. ఇలా అన్ని రంగాలకు చెందిన వారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. అయితే నటి, యాంకర్‌ అనసూయ మాత్రం ఈ దినోత్సవం రోజు చిర్రెత్తుకొచ్చినట్లు ప్రవర్తించింది. సోషల్‌ మీడియాలో ఆమె తన ఆవేదనను బయట పెట్టింది. ఈ క్రమంలోనే మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె పెట్టిన పోస్టు వైరల్‌ గా మారింది.

Anasuya Bharadwaj post on womens day gets attention
Anasuya Bharadwaj

సాధారణంగా కొందరు పురుషులు ఎప్పటికీ మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వడాన్ని అస్సలు ఒప్పుకోరు. అలాంటి వారు మహిళలపై వివక్షను చూపిస్తూనే ఉంటారు. మహిళలను వేధింపులకు, అవమానాలకు గురి చేయడం చేస్తూనే ఉంటారు. మహిళలు అనగానే వారికి ఏమీ చేతకాదని అంటుంటారు. సోషల్‌ మీడియాలోనూ మహిళలను తక్కువ చేస్తూ ట్రోల్‌ చేస్తుంటారు. వారిని విమర్శిస్తుంటారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ అలాంటి విమర్శకులకు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఇంతకీ అసలు ఆమె ఏమన్నదంటే..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే మహిళలను విమర్శించే వాళ్లకు సడెన్‌గా మహిళలు గుర్తుకు వస్తారు. వారిని గౌరవిస్తూ.. ఎంతో మర్యాద ఇచ్చినట్లు పోస్టులు పెడుతుంటారు. కానీ అది ఈ రోజు వరకే.. 24 గంటలు ముగిస్తే తిరిగి యథావిధిగా పరిస్థితి మారుతుంది. వారు మళ్లీ మహిళలను విమర్శిస్తూనే ఉంటారు. కనుక ఈ దినోత్సవాలను నమ్మకండి. సమాజంలో మహిళలకు గౌరవం ఇచ్చేవారు కరువయ్యారు.. అంటూ ఆమె హ్యాపీ ఫూల్స్‌ డే.. అని పోస్ట్‌ పెట్టింది.

అయితే అనసూయ పెట్టిన పోస్టుకు కొందరు మద్దతు పలుకుతుండగా.. కొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. సమాజంలోని మగాళ్లు అందరూ అనసూయ చెప్పినట్లుగా ఉండరని.. కేవలం కొందరు మాత్రమే మహిళలను విమర్శిస్తారని.. కనుక ఆమె ఈ విధంగా మగాళ్లందరినీ ఉద్దేశిస్తూ పోస్టు పెట్టడం సరికాదని.. అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన ఈ పోస్టు వైరల్‌ అవుతోంది.

Share
Editor

Recent Posts