Samantha : స‌మంత ఇంకో కొత్త వ్యాపారం.. భారీగానే పెట్టుబ‌డి..?

Samantha : సెల‌బ్రిటీలు అన్నాక కేవ‌లం సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు.. ప‌లు ఇత‌ర వ్యాపారాలు కూడా చేస్తుంటారు. కొంద‌రు సొంతంగా వ్యాపారాలు చేస్తుంటే.. కొంద‌రు పార్ట్‌న‌ర్‌షిప్‌లో బిజినెస్ చేస్తున్నారు. ఇక న‌టి స‌మంత కూడా సొంతంగా కాకుండా పార్ట్ న‌ర్‌షిప్‌లో ఓ కొత్త బిజినెస్‌లో పెట్టుబ‌డి పెట్టింది. స‌స్టెయిన్ కార్ట్ అనే స్టార్ట‌ప్‌లో ఆమె పెట్టుబ‌డి పెట్టింది. ఈ విష‌యాన్ని ఆ సంస్థ స్వ‌యంగా వెల్ల‌డించింది.

Samantha invests in sustain kart startup
Samantha

స‌స్టెయిన్ కార్ట్ ద్వారా రిటెయిల్ స్టోర్స్‌ను ఏప్రిల్‌లో అందుబాటులోకి తేనున్నామ‌ని ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌క సీఈవో ద‌త్ తెలిపారు. అయితే ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు పెట్టిన పెట్టుబ‌డుల ద్వారా 1000కి పైగా బ్రాండ్స్‌కు చెందిన 85వేల స్టాక్ కీపింగ్ యూనిట్స్‌ను సిద్ధంగా ఉంచామ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్‌లో తొలి ఆఫ్ లైన్ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చి క‌స్ట‌మర్ల‌కు ఓ కొత్త షాపింగ్ అనుభూతిని అందిస్తామ‌ని తెలిపారు.

అయితే స‌స్టెయిన్ కార్ట్‌లో ఎంత పెట్టుబ‌డి పెట్టింది స‌మంత వెల్ల‌డించ‌లేదు. కానీ ఆమె త‌న స్నేహితురాలు శిల్పారెడ్డి స‌హాయంతో ఈ సంస్థలో పెట్టుబ‌డి పెట్టింది. అయితే ఇప్ప‌టికే సాకి అనే దుస్తుల బ్రాండ్‌కు స‌మంత య‌జ‌మానిగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె మ‌రో కొత్త వ్యాపారంలో పెట్టుబ‌డి పెట్ట‌డం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మ‌రి దీని ద్వారా ఆమె లాభాలు గ‌డిస్తుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Editor

Recent Posts