Vellulli Karam : వెల్లుల్లి కారం ఇలా చేయండి.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Vellulli Karam : మ‌నం వేపుళ్లు చేసిన‌ప్పుడు ఎక్కువ‌గా సాధార‌ణ కారానికి బ‌దులుగా వెల్లుల్లి కారాన్ని వేస్తూ ఉంటాము. వెల్లుల్లి కారం వేసి చేసే వేపుళ్లు చాలా రుచిగా ఉంటాయి. కొంద‌రు ఈ వెల్లుల్లి కారాన్ని అప్ప‌టిక‌ప్పుడు మిక్సీ ప‌ట్టుకుని వేపుళ్ల‌ల్లో వేస్తూ ఉంటారు. ఇలా ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకోవ‌డంతో పాటు మ‌నం సంవ‌త్స‌ర‌మంతా నిల్వ ఉండే వెల్లుల్లి కారాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. వెజ్ తో పాటు నాన్ వెజ్ వేపుళ్ల‌ల్లో కూడా ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకోవ‌చ్చు. సంవ‌త్స‌ర‌మంతా నిల్వ ఉండేలా వేపుళ్ల‌ల్లో వేసే వెల్లుల్లి కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఎండుమిర్చి – 200 గ్రా., కాశ్మీరి మిర్చి – 50 గ్రా., ప‌సుపు కొమ్ములు – 10 నుండి 15 గ్రా., ఉప్పు – 50 గ్రా., జీల‌క‌ర్ర – 25 గ్రా., పొట్టుతో ఉండే వెల్లుల్లి రెబ్బ‌లు – 50 నుండి 60 గ్రా.

Vellulli Karam recipe in telugu make in this way
Vellulli Karam

వెల్లుల్లి కారం త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఎండుమిర్చిని, కాశ్మీరి మిర్చిని వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా దోర‌గా వేయించిన త‌రువాత వ‌స్త్రంపై వేసి 4 గంట‌ల పాటు ఎండ‌లో ఆర‌బెట్టాలి. త‌రువాత క‌ళాయిలో ప‌సుపు కొమ్మ‌లు, ఉప్పు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. వీటిని కూడా త‌డి పోయే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకుని ఎండ‌లో 2 గంట‌ల పాటు ఆర‌బెట్టాలి. అలాగే వెల్లుల్లి రెబ్బ‌ల‌ను కూడా పొట్టుతో స‌హా ఎండలో ఎండ‌బెట్టాలి. ఇప్పుడు ఎండుమిర్చిని, ప‌సుపు, ఉప్పు, జీల‌క‌ర్ర‌ను గిర్నిలో వేసి మెత్త‌గా చేసుకోవాలి. వీలైన వారు వీటిని మిక్సీలో వేసి కూడా మెత్త‌గా చేసుకోవ‌చ్చు. ఇలా ఎండుమిర్చిని మ‌ర ఆడించిన త‌రువాత ఒక జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ముందుగా సిద్దం చేసుకున్న‌ కారంలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వెల్లుల్లి కారం త‌యార‌వుతుంది. దీనిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల సంవ‌త్స‌రం పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన వెల్లుల్లి కారం వేసి చేసే వేపుళ్లు చాలా రుచిగా ఉంటాయి.

D

Recent Posts