ఆధ్యాత్మికం

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని తొలుత ఎవ‌రు ద‌ర్శించుకుంటారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తిరుమలలో శ్రీవారి దర్శనమంటే ఎవరికైనా చాలా ఆసక్తి ఉంటుంది&period; మరి తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఎవరికి కలుగుతుంది&period; అది ఒకటి&comma; రెండు సార్లు కాదు&period; జీవితాంతం వారే తొలిదర్శనం చేసుకుంటారు&period; వారే ఎందుకు తొలి దర్శనం చేసుకుంటారు&period; ఎవరు వారు ఆ చరిత్ర ఏమిటి&quest; సూర్యోత్పూర్వానికి ముందే పూజారులు శుభ్రంగా నదీస్నానం చేసి ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి నమస్కరించి ఆలయాన్ని తెరుస్తారు&period; అంటే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు&period; ఇది సాధారణ ఆలయాల్లో&&num;8230&semi; మరి తిరుమలలో ఏం జరుగుతుంది&period; వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలా ఉంటుంది&period; శ్రీవారి ఆలయానికి పెద్ద వ్యవస్థ ఉంది&period; తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంది&period; అయితే ఎవరు తలుపులు తెరుస్తారు&period;&quest; తొలిదర్శనం ఎవరు చేసుకుంటారు&period; ప్రతీ రోజూ ఒకే ఒకాయన తలుపు తెరుస్తారు&period; ఆయనే తొలిదర్శనం చేసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరాయన అంటే సన్నిధి గొల్ల వారే తొలి దర్శనం చేసుకుంటారు&period; ఎందుకలా&period;&period;&quest; అంటే మనం చరిత్రలోకి తొంగి చూడాల్సిందే&period; ఎప్పటి నుంచో స్వామి వారికి ఓ వ్యవస్థ ఉంది&period; ఆ వ్యవస్థ ప్రకారం స్వామి పరకామణిని కొందరు చూస్తే&period;&period; ఆలయాన్ని కొందరు చూసేవారు&period; పూజాధి కార్యక్రమాలు అర్చకులు చేస్తారు&period; ఇందులో భాగంగా స్వామి వారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూసేవారు&period; ఉదయం ఆలయం తెరచి రాత్రి మళ్ళీ మూసుకుని వెళ్ళేవారు&period; తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు&period; ఆ బాధ్యతను నేటికి వారే నిర్వహిస్తున్నారు&period; అందుకే వీరిని సన్నిధి గొల్ల అంటారు&period; సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు&period; ఆనవాయితీగా ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటీ చేపట్టుకుని 3 గంటల సమయంలో కుంచెకోల&lpar;తాళాలు ఉండేది&rpar; తీసుకుని ఆలయానికి బయలుదేరుతారు&period; అంతకు మునుపు అర్చకులు ఆయన ఇంటి వెళ్ళి ఆయనను ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91467 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;venkateshwara-swamy-1&period;jpg" alt&equals;"do you know first who visits venkateshwara swamy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందరు కలసి ఆలయం వద్దకు వెళ్ళతారు&period; అందరూ బయట నిలబడి ఉండగా గొల్లసన్నిధి తాళాలతో తలుపులు తెరుస్తారు&period; అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్ళి జీయంగార్ స్వాములు వేదపండితులు సుప్రభాతం పఠనం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తెరుస్తారు&period; దీంతో ఆయనకు వేంకటేశ్వర స్వామి తొలిదర్శనం లభిస్తుంది&period; ఆ తరువాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి పవళింప చేసిన భోగశ్రీనివాస మూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్ళతారు&period; తరువాత అన్ని రకాల కైంకర్యాలు జరుగుతాయి&period; ఇలా తొలిదర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది&period; తిరిగి రాత్రి తుది దర్శనాన్ని చేసుకుని తలుపులు వేసి సన్నిధి గొల్ల తాళాలను తను నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts