Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌.. పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా ?

Vijay Devarakonda : టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌రకొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల పేరు చెప్ప‌గానే వీరు న‌టించిన సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. వీరు నటించిన గీత గోవిందం సినిమా బంపర్ హిట్ కావ‌డంతో వీరిది హిట్ పెయిర్‌గా పేరుప‌డిపోయింది. దీంతో డియ‌ర్ కామ్రేడ్‌తో మ‌రోమారు వీరు ప‌ల‌క‌రించారు. అయితే ఈ మూవీ అంత పెద్ద విజ‌యం సాధించ‌లేదు. కానీ లిప్ లాక్ స‌న్నివేశాల్లో మాత్రం ఎలాంటి మొహ‌మాటం లేకుండా సుల‌భంగా న‌టించేశారు. దీంతో ప్రేక్ష‌కులు షాక‌య్యారు.

Vijay Devarakonda  and Rashmika Mandanna reportedly in marriage planning
Vijay Devarakonda

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి వారు అంత‌లా ఎందుకు న‌టించారో కార‌ణం క‌నిపెట్టేశారు. వారు ప్రేమ‌లో ఉన్నార‌ని.. అందుక‌నే అలాంటి సీన్ల‌లో అద్భుతంగా న‌టించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ త‌రువాత కూడా వీరు బ‌య‌ట అక్క‌డ‌క్క‌డా క‌ల‌సి తిరుగుతూనే ఉన్నారు. దీంతో వీరి మ‌ధ్య ల‌వ్ ఉంద‌ని వార్త‌లు వ‌స్తూనే ఉంటాయి. కానీ వారు మాత్రం ఆ విష‌యాన్ని ఖండిస్తూనే ఉన్నారు. తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు.

ఇక విజ‌య్ ఇంట్లో ఏ ఫంక్ష‌న్ జ‌రిగినా ర‌ష్మిక హాజ‌రు కావ‌డం కూడా అనుమానాల‌ను బ‌ల‌ప‌రిచింది. దీంతో వీరి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తుంద‌ని తేల్చేశారు. అయితే సోష‌ల్ మీడియాలో తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌ల ప్ర‌కారం.. వీరు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వీరు త‌ర‌చూ క‌ల‌సి తిరుగుతున్నార‌ని అంటున్నారు.

2022 చివర్లో లేదా 2023 ఆరంభంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల వివాహం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ఇరు కుటుంబాల మ‌ధ్య ఈ విష‌య‌మై చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని చెబుతున్నారు. అయితే ఈ వార్త‌ల్లో ఎంత నిజం ఉంద‌నేది తెలియ‌దు కానీ.. ఈ వార్త మాత్రం వైర‌ల్ అవుతోంది.

Admin

Recent Posts