vivo V23e 5G : భారీ డిస్‌ప్లే, 50 మెగాపిక్స‌ల్ కెమెరాతో వ‌చ్చిన వివో వి23ఇ 5జి స్మార్ట్ ఫోన్‌..!

vivo V23e 5G : మొబైల్స్ త‌యారీదారు వివో కొత్త‌గా వి23ఇ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం.

vivo V23e 5G  smart phone launched in India
vivo V23e 5G

వివో వి23ఇ 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లో విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్‌ను ఇందులో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది.

ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు అద‌నంగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా కూడా ఉంది. ముందు వైపు 44 మెగాపిక్స‌ల్ కెపాసిటీ క‌లిగిన సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు.

ఈ ఫోన్‌లో 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 4050 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఫాస్ట్ చార్జింగ్ ఉంది క‌నుక ఇది కేవ‌లం 30 నిమిషాల్లోనే 69 శాతం వ‌ర‌కు చార్జింగ్ అవుతుంది. ఇక ఈ ఫోన్ ధ‌ర రూ.25,990 గా ఉండ‌గా.. దీన్ని వివో ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తున్నారు.

Share
Admin

Recent Posts