Health Tips : రోజూ ప‌ర‌గ‌డుపునే ప‌సుపు, మిరియాలు క‌లిపిన నీళ్ల‌ను తాగండి.. ఈ వ్యాధులు త‌గ్గిపోతాయి..!

Health Tips : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును ఉప‌యోగిస్తున్నారు. ఇది మ‌న‌కు వంటి ఇంటి ప‌దార్థంగా మారింది. కానీ ఆయుర్వేద ప్ర‌కారం ప‌సుపులో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇందులో ఫైబ‌ర్‌, ఐర‌న్‌, విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే న‌ల్ల మిరియాలు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిల్లో యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటినీ కలిపి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips  take black pepper and turmeric with warm water on empty stomach for these benefits
Health Tips

1. ఉదయాన్నే ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ప‌సుపు, న‌ల్ల మిరియాల పొడి క‌లిపి తాగితే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. మెట‌బాలిజంను మెరుగు ప‌రుస్తుంది. దీంతో క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా క‌రిగిపోతుంది.

2. శ‌రీరంలో ఏ భాగంలో నొప్పి ఉన్నా ప‌సుపును తీసుకుంటే త‌గ్గిపోతుంది. అలాగే ఇన్‌ఫెక్ష‌న్ల‌పై పోరాటం చేస్తుంది. దీంతోపాటు మిరియాలు కూడా నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల ప‌సుపు, మిరియాల పొడి క‌లిపిన నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపునే తాగితే ప్ర‌యోజ‌నం ఉంటుంది. దీంతో వాటిల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయి.

3. రోజూ ప‌సుపు, మిరియాల పొడి క‌లిపిన నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఏ భాగంలో ఉండే వాపులు అయినా స‌రే త‌గ్గిపోతాయి. ముఖ్యంగా పాదాల వాపులు ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది.

4. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాంటి వారు రోజూ ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ప‌సుపు, మిరియాల పొడి క‌లిపి తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది.

5. అధిక బ‌రువు ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తాగుతుంటే చ‌క్క‌ని ఫ‌లితం ఉంటుంది. చాలా త్వ‌ర‌గా బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

Admin

Recent Posts