ఆధ్యాత్మికం

Bhimshankar : ఈ క్షేత్రాన్ని ద‌ర్శిస్తే చాలు.. మొండి రోగాలు న‌య‌మ‌వుతాయి.. అదృష్టం ఎలా ప‌డుతుందంటే..?

Bhimshankar : చాలా మందికి ఆలయాలని సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. అయితే మీరు మంచి ఆలయాలని సందర్శించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా భీమా శంకరం గురించి తెలుసుకోవాలి. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తుని తొలగించడం వలన భీమా శంకర జ్యోతిర్లింగం గా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మహారాష్ట్ర లో పూణే కి 127 కిలో మీటర్ల దూరం లో ఉంది.

ముంబాయికి 200 కిలో మీటర్ల దూరం పూణే జిల్లా లోని ఖేడ్ తాలూక లో భీమా శంకరం లోని భీమా నది పక్కన భావగిరి అనే గ్రామం లో ఇది వెలసింది. కొండ పై భాగం లో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలశారు. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. భీమా శంకర్ దేవాలయాన్ని 13వ శతాబ్దం లో నాగరా పద్ధతి లో పీశ్వర్ దీవాన్ అయిన నానా ఫడ్నవిస్ నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

visit Bhimshankar to cure diseases and get wealth

నల్లటి రాయి తో చెక్కిన ఈ ఆలయ శిఖరం చూడడానికి ఎంతో అనుభూతిని ఇస్తుంది. ఈ గుడి లోపల చిన్న శివలింగాన్ని వెండి తో తాపడం చేశారు దాని మీద ఒక కత్తి ఘాటు కూడా ఉంటుంది. అడవి కొండల లోని ఈ ప్రాంతంలోని ఆలయం చూసేందుకు చాలా చూడ ముచ్చటగా ఉంటుంది.

ఈ ఆలయానికి దగ్గర లో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం సహ్యాద్రి వన్య ప్రాణ రక్షణ నిలయంలో పెద్ద ఉడతలు ఇలా చుట్టు పక్కల కూడా ఎంతో అందంగా ఉండడం తో చాలా మంది ఎక్కువగా ఇక్కడకి వస్తూ ఉంటారు. దీంతో ఆలయం రద్దీగా ఉంటుంది. ఆగస్టు ఫిబ్రవరి నెల లో ఈ ఆలయాన్ని చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ఖండాస్ నుండి రెండు నడక మార్గాలు ఉన్నాయి. కృష్ణా నదికి ఉపనది అయిన భీమా నది ఇక్కడే పుట్టింది. ఇది పుట్టిన చోట శివలింగం పక్క భాగము నుండి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది.

Admin

Recent Posts