Perfume : మనం ఎండలో బయట తిరిగితే శరీరంపై చెమట వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. చెమట వల్ల శరీరం నుంచి దుర్గంధం కూడా వస్తుంటుంది. దీంతో ఆ చెడు వాసన ఇతరులకు రాకుండా ఉండేందుకు గాను మనం పెర్‌ఫ్యూంలను వాడుతుంటాం. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనకు మార్కెట్‌లో అనేక రకాల పెర్‌ఫ్యూంలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పెర్‌ఫ్యూం అయినా సరే.. చాలా తక్కువ సమయం పాటు మాత్రమే మన శరీరంపై ఉంటుంది. కొన్ని గంటలు అయ్యాక పెర్‌ఫ్యూం వాసన పోతుంది. అయితే పెర్‌ఫ్యూం వాసన త్వరగా పోకుండా ఎన్ని గంటల పాటు అయినా అలాగే ఉండేందుకు పలు చిట్కాలను పాటించాలి. అవేమిటంటే..
శరీరంపై మీరు పెర్‌ఫ్యూం స్ప్రే చేసుకునే భాగాల్లో పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. దీంతో పెర్‌ఫ్యూం ఎక్కువ సేపు శరీరంపై ఉంటుంది. చర్మంపై పెర్‌ఫ్యూం స్ప్రే చేసుకునే ముందు మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. చర్మానికి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం వల్ల శరీరం మృదువుగా, జిడ్డుగా మారుతుంది. దీంతో పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ సేపు ఉంటుంది. ఒక చేయి మణికట్టును మరొక చేయి మణికట్టుతో రుద్ద రాదు. దీని వల్ల పెర్‌ఫ్యూం త్వరగా పోతుంది. పెర్‌ఫ్యూంలో కాటన్ బడ్స్‌ను ముంచి వెంట తీసుకెళ్తే.. రోజులో ఎప్పుడైనా పెర్‌ఫ్యూం వాసన పోతే అప్పుడు ఆ కాటన్ బడ్స్‌ను శరీరంపై టచప్ చేసుకోవాలి. దీంతో వాటిలో ఉండే పెర్‌ఫ్యూం శరీరానికి అప్లై అవుతుంది. ఫలితంగా పెర్‌ఫ్యూం వాసనను తిరిగి పొందవచ్చు.
పెర్‌ఫ్యూం స్ప్రే చేసుకునేటప్పుడు బాటిల్‌ను షేక్ చేయరాదు. అలా చేస్తే పెర్‌ఫ్యూం శరీరానికి సరిగ్గా అప్లై అవ్వదు. దీంతో పెర్‌ఫ్యూం త్వరగా పోతుంది. కనుక పెర్‌ఫ్యూం స్ప్రే చేసేటప్పుడు బాటిల్‌ను నిలకడగా పట్టుకోవాలి. పెర్‌ఫ్యూం బాటిల్‌పై లైట్ లేదా సూర్య కాంతి నేరుగా పడకుండా చూసుకోవాలి. కాంతి పడితే పెర్‌ఫ్యూం త్వరగా వాసనను కోల్పోతుంది. అలాంటి పెర్‌ఫ్యూంను వాడినా ఫలితం ఉండదు. కనుక కాంతి పడని ప్రదేశాల్లో పెర్‌ఫ్యూం బాటిల్స్‌ను ఉంచాలి. శరీరంపై పెర్‌ఫ్యూం స్ప్రే చేశాక కొంత సేపు వెయిట్ చేసి దుస్తులు వేసుకుంటే పెర్‌ఫ్యూం వాసన చాలా సేపు ఉంటుంది. పెర్‌ఫ్యూంలను ఎప్పుడూ బెడ్‌రూంలో కాంతి పడని ప్రదేశంలో ఉంచాలి. బాత్‌రూంలో పెడితే తేమ వల్ల పెర్‌ఫ్యూం త్వరగా వాసనను కోల్పోతుంది. ఆ తరువాత దాన్ని వాడినా ప్రయోజనం ఉండదు.