చిట్కాలు

Beauty Tips : ఈ చిట్కాను పాటిస్తే చాలు మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.. బ్యూటీ పార్ల‌ర్ అవ‌స‌ర‌మే ఉండ‌దు..!

Beauty Tips : అందంగా క‌నిపించేందుకు మ‌హిళ‌లు నేటి త‌రుణంలో అనేక ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. ఇందుకు గాను మార్కెట్‌లో ల‌భించే ఖ‌రీదైన సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను వాడుతున్నారు. అలాగే బ్యూటీ పార్ల‌ర్‌ల‌కు వెళ్లి వేల‌కు వేలు ఖ‌ర్చు చేస్తున్నారు. అయితే ఇవ‌న్నీ కృత్రిమంగా అందాన్ని అందించేవే. అందువ‌ల్ల అలా వ‌చ్చే అందం ఎక్కువ కాలం పాటు ఉండ‌దు. క‌నుక స‌హ‌జ‌సిద్ధ‌మైన మార్గాల‌ను పాటించాలి. దీంతో ఎల్ల‌కాలం అందంగా ఉంటారు. అందం అలాగే స‌జీవంగా ఉంటుంది. ఇందుకు పాటించాల్సిన నాచుర‌ల్ టిప్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ప‌చ్చిపాల‌ను తీసుకుని ముఖానికి బాగా రాయాలి. అందుకు గాను కాట‌న్ బాల్ స‌హాయం తీసుకోవాలి. త‌రువాత నీటితో క‌డిగేయాలి. అనంత‌రం కాసేపు ఆగి చ‌క్కెర పొడి, తేనె, నిమ్మ‌ర‌సం ఫేస్ ప్యాక్ వేయాలి. 30 నిమిషాలు ఆగాక దీన్ని కూడా క‌డిగేయాలి. ఆ త‌రువాత మ‌ళ్లీ కాసేపు ఆగి ఒక పాత్ర‌లో వేడి నీటిని తీసుకుని అందులో నుంచి వ‌చ్చే ఆవిరికి ఎదురుగా ముఖం పెట్టాలి. దీంతో ముఖం క్లీన్ అవుతుంది.

follow these beauty tips you will not go to beauty parlour

త‌రువాత మ‌ళ్లీ ఫేస్ ప్యాక్ వేయాలి. ఇందుకు గాను కొబ్బరినూనె, తేనె, ప‌సుపు, నిమ్మ‌ర‌సం, పెరుగును ఉప‌యోగించాలి. వీటితో ఫేస్ ప్యాక్ వేసి మ‌ళ్లీ 30 నిమిషాలు అయ్యాక క‌డిగేయాలి. అయితే ఈ చిట్కాల‌ను ఒక‌దాని త‌రువాత ఒక‌టి పాటించ‌వ‌చ్చు. లేదా మీకు వీలు కుదిరిన‌ప్పుడు ఒక‌దాని త‌రువాత ఒక‌టి ఒక్కో రోజు చేయ‌వ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మీరు బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్ల‌కుండానే త‌గినంత అందాన్ని పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts