ఆధ్యాత్మికం

Bath : ఈ 4 పనులు అయ్యాక.. క‌చ్చితంగా స్నానం చేయాల్సిందే.. లేదంటే ప్ర‌మాదం..!

Bath : ఆచార్య చాణక్య జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. చాణక్య.. స్నేహితులు మధ్య గొడవల‌ గురించి, భార్యాభర్తల మధ్య సమస్యల గురించి ఇలా ఎన్నో సమస్యల గురించి చెప్పుకొచ్చారు. ఏ సమస్యలకైనా సరే చాణక్య సూత్రాలతో పరిష్కారం కనబడుతుంది. చాణక్య.. స్త్రీలు ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి, పురుషులు ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి అనేది కూడా వివరించారు.

ముఖ్యంగా పురుషులు ఈ పనులు చేసిన తర్వాత స్నానం చేయడం మర్చిపోకూడదని ఆచార్య చాణక్య అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాలుగు పనులు చేసిన తర్వాత పురుషులు కచ్చితంగా స్నానం చేయాలని చాణక్య చెప్పారు. మరి చాణక్య చెప్పిన విషయాలు గురించి ఇప్పుడు చూద్దామా. వారానికి ఒకసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవాలని చాణక్య అన్నారు. అలా చేసుకోవడం వలన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయ‌ట. వాటి ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలు బయటకి వస్తాయి.

we must bath after these 4 works know why

కనుక ఆయిల్ మసాజ్ చేసుకోవడం, ఆ తర్వాత స్నానం చేయడం ముఖ్యమని చాణక్య అన్నారు. అలానే పురుషులు జుట్టు కత్తిరించుకున్న తర్వాత, స్నానం చేయాలని చాణక్య అన్నారు. జుట్టు కత్తిరించుకున్న తర్వాత, కేవలం తలని మాత్రమే కడగకుండా పూర్తిగా స్నానం చేయాలని చాణక్య చెప్పారు. జుట్టు కత్తిరించిన తర్వాత, జుట్టు శరీరానికి అతుక్కుపోతుంది. వెంటనే స్నానం చేస్తే, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేదంటే చిన్న చిన్న వెంట్రుకలు వలన బ్యాక్టీరియా పేరుకు పోతుంది.

కాబట్టి, తప్పకుండా జుట్టు కత్తిరించుకున్న తర్వాత కూడా స్నానం చేయాల‌ని చాణక్య చెప్పారు. అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా తప్పక స్నానం చేయాలని చాణక్య అన్నారు. చనిపోయిన వారి శరీరంలో బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉండదు. వారి శరీరంలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అంత్యక్రియలు నుండి వచ్చాక కచ్చితంగా స్నానం చేయాల‌ని చాణక్య అన్నారు. అలానే శృంగారంలో పాల్గొన్న తరువాత పురుషులు స్నానం చెయ్యాల‌ని చాణక్య అన్నారు.

Admin

Recent Posts