Kidney Problems And Spinach : ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆకుకూరలని చాలామంది రెగ్యులర్ గా, తీసుకుంటూ ఉంటారు. ఆకుకూరల వలన, అనేక లాభాలు ఉంటాయి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ తో పాటుగా విటమిన్ సి, విటమిన్ కె కూడా ఉంటాయి. రెగ్యులర్ గా, పాలకూరని తీసుకుంటే, చక్కటి ఫలితం ఉంటుంది. లిమిట్ గానే తీసుకోవాలి. పాలకూరని తీసుకోవడం వలన, అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, పాలకూర ఎంతగానో మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. అలానే, పాలకూరలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది.
రోజు చిన్న కప్పు పాలకూరని మాత్రమే తీసుకోండి. లేదంటే, వారంలో రెండు మూడు సార్లు పాలకూరని తీసుకోవచ్చు. లిమిట్ గా తీసుకుంటే, సమస్యలు ఏమి కూడా రావు. ఎక్కువగా తీసుకుంటే, కొన్ని సమస్యలు తప్పవు. అధిక మోతాదులో పాలకూరని తీసుకుంటే ఏమవుతుంది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. మొక్కలలో సహజంగా లభించే కాంపౌండ్.
ఒకవేళ కనుక శరీరంలో ఆక్సలిక్ ఆసిడ్ మోతాదు మించితే, శరీరంలో ఇతర పోషకాలు గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. కిడ్నీ రాళ్లతో బాధపడే వాళ్ళు, పాలకూరకి దూరంగా ఉండాలి. ఎక్కువగా పాలకూరని తీసుకుంటే, ఆక్సాలిక్ యాసిడ్ మోతాదు పెరిగిపోతుంది. ఆక్సాలిక్ యాసిడ్ ని బయటికి పంపడం కష్టం అవుతుంది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు, పాలకూరని ఎక్కువ తీసుకోకూడదు. పాలకూరలో ఉండే గుణాలు నొప్పులకి కారణం అవుతాయి. పాలకూర తో మనం రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఈజీ గానే పాలకూరని వండుకోవచ్చు. సో రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. కానీ మోతాదుకు మించి తీసుకోండి.