lifestyle

Sleep : నిద్రించేట‌ప్పుడు ఎడ‌మ‌వైపు ప‌డుకోవాలి.. లేచేట‌ప్పుడు కుడి వైపు నుంచి లేవాలి.. ఎందుకంటే..?

Sleep : ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా రోజూ కనీసం 8 గంటల సేపు నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. నిద్రపోయేటప్పుడు కూడా పలు నియమాలని పాటించాలి. నిజానికి పెద్దలు చెప్పిన‌ కొన్ని నియమాల‌ వెనుక సైన్స్ దాగి ఉంది. మూఢనమ్మకాలని చెప్పి కొట్టి పారేస్తే దాని వలన అనవసరంగా ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. పూర్వకాలంలో పెద్దలు పిల్లలకి ఎడమవైపుకి తిరిగి నిద్రపోవాలని చెప్పేవారు.

లేచే సమయంలో కుడివైపుకి తిరిగి లేవమని అనేవారు. అలా చెప్పడానికి ముఖ్య కారణం భోజనం చేసిన తర్వాత ఆహారం అంతా కూడా జఠరకోశంలో ఉంటుంది. జీర్ణమైన తర్వాత ఆహారం అక్కడ నుండి చిన్న పేగుల్లోకి వెళ్లే దారి కుడివైపు ఉంటుంది. అయితే మనం సరిగ్గా నిద్రపోకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి. హృదయం శరీరానికి ఎడమ వైపు ఉంటుంది. హృదయం నుండి శుద్ధరక్తం అన్ని భాగాలకు వెళ్లే ముఖ్య రక్తనాళం కుడిభాగం నుండి మొదలవుతుంది.

we should sleep left side and wake up from right side we should sleep left side and wake up from right side

మనం రాత్రి సమయంలో కుడివైపుకు తిరిగి పడుకుంటే శుద్ధ రక్తం కోసం కొంచెం ఎక్కువగా స్రవిస్తుంది. శుద్ధరక్తం రాత్రిపూట ఎక్కువగా అవసరం లేదు. అంటే నిద్రించే టైంలో ఎక్కువ పరిణామాలలో అక్కర్లేదు. లిమిట్ గా అయితే సరిపోతుంది. కుడివైపుకి తిరిగి నిద్రపోవడం వలన మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా జఠరకోశం నుండి చిన్న పేగులకి బలవంతంగా ప్రవేశించే అవకాశం ఉంటుంది.

దీంతో కడుపులో వికారం కలుగుతుంది. ఇలా పలు సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రి పూట ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవాలి. అలాగే మనం నిద్రలేచేటప్పుడు ఎడమ వైపుకి తిరిగి నిద్రలేస్తే శరీరంలో కొంత భారం ఎడమవైపు ఉన్న హృదయం మీద పడుతుంది. కాబట్టి కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకుని నిద్రపోయేటప్పుడు, లేచేటప్పుడు చూసుకోండి.

Admin

Recent Posts