ఆధ్యాత్మికం

సింధూరం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం సింధూరానికి (కుంకుమ) కి ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమను ఒక సౌభాగ్యంగా మహిళలు భావిస్తారు. పెళ్లైన మహిళలు కుంకుమ నుదిటిపై పెట్టుకోవటం వల్ల తన భర్త క్షేమంగా ఉంటాడని తన భర్త ఆయుష్షు పెరుగుతుందని భావిస్తారు. అదే విధంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ సింధూరాన్ని నిత్యం పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు. అందుకే సింధూరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.అయితే కుంకుమను కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా కుంకుమ ధరించడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

మన కుటుంబంలోని సభ్యులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిపై కొద్దిగా సిందూరం నీళ్లు చల్లడం వల్ల వారి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదే విధంగా మన ఇంట్లో ఏదైనా సమస్యలు తలెత్తితే కుంకుమలో జాస్మిన్ ఆయిల్ కలిపి హనుమంతునికి ఐదు శనివారాలు లేదా ఐదు మంగళవారాలు పూజ చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి.

what are the benefits of wearing sindhuram

మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే కుంకుమను తీసుకొని ఒక కొబ్బరి కాయ పై వేసి ఆ కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజ చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదే విధంగా ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కుంకుమలోకి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి మన ప్రధాన ద్వారం పై భాగంలో బొట్టు పెట్టడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts