వినోదం

Jayasudha : రాధే శ్యామ్ సినిమాకు, జ‌య‌సుధ జీవితానికి సంబంధం ఏమిటి..?

Jayasudha : ప్రభాస్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి బోల్తా కొట్టింది. 2019 సాహో తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉండేవి. పీరిడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా ప్ర‌భాస్‌కి భారీ న‌ష్టాన్ని చేకూర్చింది. అయితే ఇందులో ప్రభాస్ పామిస్ట్ రోల్‌లో న‌టించాడు.ఆయ‌న చెప్పిన‌వి అన్ని నిజం అయ్యేవి. ఇక సీనియ‌ర్ న‌టీ జ‌య‌సుధ జీవితంలో కూడా ఓ జ్యోతిష్కుడు చెప్పింది నిజ‌మైందట‌. దీంతో ఈ సినిమాకి జ‌య‌సుధ‌కి సంబంధం ఉంద‌ని కొంద‌రు ప్ర‌చారం చేశారు.

జ‌య‌సుధ త‌ల్లిదండ్రులు జోగాబాయి, ర‌మేష్‌. త‌ల్లి జోగాబాయికి సినిమాల ప‌ట్ల ఆస‌క్తి ఉండ‌డంతో కొన్ని సినిమాల్లో న‌టించింది. జ‌య‌సుధ‌కు సినిమాలంటే ఆస‌క్తి ఉండేది కాద‌ట‌. పైగా 3 గంట‌ల పాటు త‌లుపులు మూసేసిన థియేట‌ర్ లో ఎవ్వ‌రూ కూర్చొంటారని త‌ల్లితో వాదించేద‌ట‌. ర‌మేష్ ఓ సారి ఫ్రెండ్స్‌తో క‌లిసి బెంగ‌ళూరు వెళ్లార‌ట‌. అక్క‌డ జ‌యాన‌గ‌ర్‌లో బాగా జాత‌కాలు చెబుతార‌ని పేరున్న ఓ రిటైర్డ్ పోస్ట్ మాస్ట‌ర్ ఉండేవార‌ట‌. ఆయ‌న ఏం చెబితే అది జ‌రిగేద‌ని న‌మ్మేవార‌ట‌. అయితే ర‌మేష్ ఓ సారి ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి జాత‌కం చూపించుకోగా, మీ పెద్ద‌మ్మాయి పెద్ద న‌టి అవుతుంది. చాలా పాపుల‌ర్ అవుతుంద‌ని అన్నాడ‌ట‌. అయితే సినిమాలే ఇష్టం లేని జ‌య‌సుధ ఎలా న‌టి అవుతుంద‌ని ర‌మేష్ అనుకున్నాడ‌ట‌.

what is the relation between jayasudha and radhe shyam movie

ఇక విజ‌య‌నిర్మ‌ల ర‌మేష్ కు సొంత చిన్నాన కూతురు. అంటే జ‌య‌సుధ‌కు మేన‌త్త.అయితే జ‌య‌సుధ‌కి చిన్న పాత్ర దొర‌క‌డంతో ర‌మేష్ లేని సమ‌యంలో వెళ్లింది. అయితే అవి మ‌న‌కు ఎందుకు అని రమేష్ వారించార‌ట‌. కాని క‌మిట్ అవ్వ‌డంతో చేయ‌క‌త‌ప్ప‌లేదు. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఆమెకు మ‌రొక రెండు ఆఫ‌ర్లు రావ‌డం.. ఇలా వ‌రుస‌పెట్టి ఆఫ‌ర్లు వ‌స్తుండ‌డంతో ర‌మేష్ అవాక్క‌య్యార‌ట‌. భార్య‌ను తీసుకుని బెంగ‌ళూరు వెళ్లి మ‌ళ్లీ ఆ జ్యోతిష్యుని క‌లిశార‌ట‌. ఆయ‌న చెప్పింది చెప్పిన‌ట్టుగానే జ‌రుగుతుండ‌డంతో ర‌మేష్ కుమార్తె సినిమా అవ‌కాశాల విష‌యంలో కాద‌న‌లేక‌పోయారు. చివ‌ర‌కు ఆమె పెద్ద స్టార్ అయిపోయింది. జ‌య‌సుధ అస‌లు పేరు సుజాత కాగా, అప్ప‌ట్లో సుజాత అనే పేరున్న న‌టి ఉండ‌డంతో ర‌మేష్‌, న‌టుడు ప్ర‌భాక‌ర్‌రెడ్డితో చ‌ర్చించి ఆమె పేరు జ‌య‌సుధ గా మార్చారు. ఇక ఆమె స‌హ‌జ‌న‌టిగా ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.

Admin

Recent Posts