Money In Hand : డబ్బు మనం జీవించడానికి చాలా అవసరం. అనేక మార్గాల్లో కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా కూడా సంపాదించిన డబ్బును చేతిలో నిలుపుకోలేకపోతారు. కష్టపడి సంపాదించిన డబ్బుకు కూడా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టకూడదని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి అవి అన్ని వృధాగా మారిపోతాయి. డబ్బు ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీంతో వారు మానసికంగా కూడా బాధను అనుభవిస్తూ ఉంటారు. సంపాదించిన డబ్బు ఖర్చై పోయి ఆర్థిక సమస్యలు రావడానికి ముఖ్యంగా 5 కారణాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ తప్పులను చేయడం వల్లె మనం ఆర్థిక సమస్యల బారిన పడుతున్నామని వారు చెబుతున్నారు.
మనల్ని ఆర్థిక సమస్యల బారిన పడేసే ఈ 5 తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం కుల దేవతలను పూజించకపోవడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు వస్తాయి. కనుక కుల దేవతలను క్రమం తప్పకుండా పూజించాలి. కుల దేవతలను పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గడంతో పాటు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో పూజలు చేయకపోవడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా పూజ చేయని వారి ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు. దీంతో ఆ కుటుంబంలోని వారు ఆర్థిక సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా ఇంట్లో ప్రతికూల శక్తులు కూడా నివాసం ఏర్పరుచుకుంటాయి. అలాగే కొందరు నిత్యం దేవున్ని శపిస్తూ ఉంటారు. దేవున్ని తిడుతూ, కోప్పడుతూ ఉంటారు. అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు.
కనుక మన సమయం ఎలా గడిచినా, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్న దేవున్ని ఆరాధిస్తూ ఉండాలి. అలాగే చాలా మంది తంత్ర మార్గాన్ని అనుసరిస్తున్నారు. తంత్ర మార్గాన్ని అనుసరించడం వల్ల చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా కూడా గడ్డు పరిస్థితులను గడపాల్సి ఉంటుంది. అలాగే పెద్దలతో పాటు ఆడవారిని గౌరవించని ఇంట్లో కూడా లక్ష్మీ దేవి ఉండదు. కనుక ఎప్పుడూ పెద్దలను, ఆడవారిని గౌరవిస్తూ వారి పట్ల ప్రేమతో, దయతో ఉండాలి. ఈ విధంగా 5 తప్పుల చేత మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలవదని కనుక మనం 5 తప్పులను చేస్తున్నట్టయితే వాటిని తప్పకుండా సరిదిద్దుకోవాలని అప్పుడే లక్ష్మీ దేవి మన ఇంట్లో నివాసం ఉంటుందని ఆర్థిక పమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.