information

ఏటీఎం నుండి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..?

డబ్బులను విత్ డ్రా చేయడానికి ఏటీఎం కు వెళ్లినప్పుడు కొన్ని సందర్భాలలో చిరిగిన నోట్లు మిషన్ నుండి వస్తాయి. అలాంటప్పుడు సహజంగా అందరూ భయపడుతూ ఉంటారు. పైగా ఎవరు కూడా అలాంటి నోట్లను తీసుకోరు. అలాంటప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం ఎప్పుడైనా మీకు చిరిగిన నోట్లు ఏటీఎం ద్వారా వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ ను ఫిల్ చేస్తే సరిపోతుంది. ఏటీఎం లింక్ అయిన బ్యాంకుకు చిరిగిన నోట్ల ను తీసుకువెళ్లి అప్లికేషన్ పై తేదీ, సమయం, అమౌంట్ వివరాలను రాస్తే ఆ నోట్లను వెంటనే మార్చుకోవచ్చు.

ఇలా మీ ఎకౌంట్ ఉన్న బ్యాంక్ దగ్గర లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ లో కూడా మార్చుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆర్బిఐ రూల్ మరొకటి ఉంది. ఒక వ్యక్తి ఒకసారి కేవలం 20 నోట్ల వరకే మార్చగలరు. అంతేకాక ఒకసారి 5000 వరకు మాత్రమే మార్చుకోగలరు.

what to do if torn notes come out of atm

సహజంగా కరెన్సీ నోట్లను ఉపయోగించడం వలన కొద్దిగా డ్యామేజ్ అవుతాయి. అలాంటి కరెన్సీ నోట్లను ఎక్స్చేంజ్ చేయడం కోసం ఎలాంటి ఫార్మ్స్ ఫిల్ చేయక్కర్లేదు. గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, కరెన్సీ చెస్ట్ బ్రాంచెస్ లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ వద్ద వాటిని మార్చుకోవచ్చు.

Peddinti Sravya

Recent Posts