Kids : మొక్కై వంగనిది మానై వంగునా.. అన్న సామెత గురించి మనందరికీ తెలిసిందే. దీన్ని పిల్లలను ఉద్దేశించే ఉపయోగిస్తారు. పిల్లలను చిన్నతనం నుంచే కంట్రోల్‌లో పెట్టాలి. లేదంటే వారు పెద్దయ్యాక ఎవరి మాట వినరు. ఎందుకూ పనికి రాకుండా పోతారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని చెప్పే ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. దీంతో అయినా పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలుగుతారు.. అని ఈ సామెతను చెబుతుంటారు. అయితే చాలా వరకు పిల్లలు చెబితే వింటారు. కానీ కొందరు మాత్రం మొండిగా ఉంటారు. తల్లిదండ్రులు చెప్పేది అసలు వినరు. అయితే అలాంటి పిల్లలను ఎలా దారిలోకి తేవాలి.. వారు మన మాటలను వినేవిధంగా ఎలా మార్చాలి.. అందుకు ఏమైనా చిట్కాలు ఉంటాయా.. అంటే.. అవును.. ఉంటాయి.. పండితులు చెబుతున్న ప్రకారం కింది చిట్కాలను పాటించడం వల్ల పిల్లలు ఎవరైనా సరే తప్పకుండా మాట వింటారు. ఇక అందుకు ఏం చేయాలంటే..
ఇంట్లో పిల్లలను నైరుతి దిశలో నిద్రించేలా ఏర్పాటు చేయాలి. పిల్లల గదిలో అద్దం ఉంచకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని వస్త్రంతో కప్పి ఉంచాలి. అలాగే పిల్లల కోసం ఆహారం వండేటప్పుడు శాంతి మంత్రాన్ని పఠించాలి. పిల్లలు నిద్రించే గదిలో చీకటిగా ఉండకూడదు. వీలైనంత గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేయాలి.
రోజూ పిల్లలకు తేనెను ఇవ్వాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే సమయంలో ఒక టీస్పూన్ తేనెను వారితో తినిపించాలి. అలాగే పిల్లలకు ఎట్టి పరిస్థితిలోనూ నలుపు రంగు దుస్తులను వేయకూడదు. అలాగే పౌర్ణమి నాడు పిల్లలను బయటకు తీసుకెళ్లి వెన్నెల పడే చోట ఉంచి అక్కడ వారికి ఏవైనా తీపి పదార్థాలను తినిపించాలి. దీంతోపాటు రాత్రి పూట పిల్లలను దగ్గర పడుకోబెట్టుకుని మీద చేయి వేసి లేదా కౌగిలించుకుని పడుకోవాలి. అలాగే ఉదయం వారిని తలపై నిమురుతూ నిద్ర లేపాలి. ఇలా రోజూ చేస్తుంటే తప్పకుండా పిల్లలు తల్లిదండ్రుల మాటలను వింటారు. వారు చెప్పినట్లు చేస్తారు. దారిలోకి వస్తారు.