Purse : ప‌ర్సులో ఈ వ‌స్తువుల‌ను పెట్టుకుంటున్నారా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Purse : సాధార‌ణంగా స్త్రీలు అయితే హ్యాండ్ బ్యాగుల‌ను చేత్తో ప‌ట్టుకుని వెళ్తుంటారు. ఇక పురుషులు అయితే ప‌ర్సుల‌ను జేబులో పెట్టుకుంటుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ.. వాస్తు శాస్త్రం ప్ర‌కారం పాటించాల్సిన కొన్ని నియ‌మాలు ఉంటాయి. ముఖ్యంగా ప‌ర్సు విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాలి. కొన్ని నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. అలా చేయ‌కపోతే ఇంట్లో ఎల్ల‌ప్పుడూ స‌మ‌స్య‌లే ఉంటాయి. ముఖ్యంగా డ‌బ్బు విష‌యంలో తీవ్ర‌మైన క‌ష్టాల పాలు కావ‌ల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే ప‌ర్సు లేదా హ్యాండ్ బ్యాగు విష‌యంలో పాటించాల్సిన వాస్తు నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది ప‌ర్సులో చ‌నిపోయిన త‌మ పూర్వీకులు లేదా పెద్ద‌ల ఫొటోల‌ను పెట్టుకుంటుంటారు. ఇలా చేయ‌డం అరిష్ట‌మ‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని వ‌ల్ల అన్నీ ఆర్థిక స‌మ‌స్య‌లే వ‌స్తాయ‌ట‌. క‌నుక అలాంటి ఫొటోల‌ను ప‌ర్సులో పెట్ట‌కూడ‌ద‌ని అంటున్నారు. అలాగే ప‌ర్సును ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అది చిరిగిపోకుండా చూడాలి. పాత‌గా అయితే ఇంకో కొత్త పర్సును తీసుకుని వాడాలి. కానీ పాత ప‌ర్సును అలాగే వాడ‌రాదు. అలా వాడితే ధ‌నం అస‌లు సంపాదించ‌లేర‌ట‌. ఎప్ప‌టికీ డ‌బ్బు స‌మ‌స్య‌లే ఉంటాయ‌ట‌.

keep these things in mind while using Purse
Purse

ఇక ప‌ర్సులో కొంద‌రు త‌మ ఇష్ట దైవానికి చెందిన ఫొటోలు లేదా కాయిన్స్‌ను పెట్టుకుంటుంటారు. అలా కూడా చేయ‌రాదు. ఎందుకంటే కొంద‌రు ప‌ర్సును ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెడుతుంటారు. వెనుక ప్యాంట్ జేబులో ప‌ర్సును పెట్టుకుని అలాగే కూర్చుంటారు. అప్పుడు దైవాన్ని అవ‌మానించిన‌ట్లు అవుతుంది. క‌నుక ప‌ర్సులో ఇష్ట దైవానికి చెందిన ఫొటోల‌ను కూడా పెట్టుకోకూడ‌దు. ఈ విధంగా వాస్తు నియమాల‌ను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీంతో అన్ని స‌మ‌స్య‌లు పోతాయి. క‌నుక ప‌ర్సు విష‌యంలో క‌చ్చితంగా ఆయా నియ‌మాలను పాటించాల్సి ఉంటుంది.

D

Recent Posts