lifestyle

Saptapadi : పెళ్లి స‌మ‌యంలో 7 అడుగులు ఎందుకు న‌డుస్తారు.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Saptapadi : హిందూ వివాహాల్లో అనేక ఆచారాలు పాటిస్తారు. ఈ ఆచారాలు ఒక్కో ప్ర‌దేశంలో ఒక్కోలా ఉంటాయి. అయితే 7 ప్ర‌మాణాలు, క‌న్యాదానం వంటివి మాత్రం హిందూ వివాహాల్లో దాదాపుగా ఉంటుంది. హిందూ వివాహాల్లో ఇవి ఖ‌చ్చితంగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తాయి. ఇవి లేకుండా జ‌రిగే వివాహం దాదాపుగా ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. తాజాగా అల‌హాబాద్ కోర్టు కూడా స‌ప్త‌ప‌ది హిందూ వివాహానికి చాలా ముఖ్య‌మైన‌ది అని అభివ‌ర్ణించింది. హిందూ వివాహ చ‌ట్టం ప్ర‌కారం వివాహానికి స‌ప్త‌ప‌ది త‌ప్ప‌నిస‌రి అని, అప్పుడే వివాహం పూర్త‌వుతుంద‌ని అల‌హాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొన్న‌ది. అయితే వివాహానికి కన్యాదానం త‌ప్ప‌నిసరి అని ఆ కోర్టు ప‌రిగ‌ణించ‌లేదు. తాజాగా ఒక క్రిమిన‌ల్ కేసు విచార‌ణ‌లో భాగంగా, పిటిషిన‌ర్ త‌న వివాహంలో క‌న్యాదానం చేయ‌లేద‌ని, దీనిని ధృవీక‌రించ‌డానికి సాక్షుల‌ను మ‌ళ్లీ విచారించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. అప్పుడు కోర్టు హిందూ వివాహ చ‌ట్టంలోని సెక్ష‌న్ 7 ను ప్రస్తావించింది.

హిందూ వివాహాల‌కు స‌ప్త‌ప‌ది త‌ప్ప‌నిస‌రి అని పేర్కొంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌న్యాదానం జ‌రిగిందా లేదా అన్న‌ది ముఖ్యం కాదు క‌నుక సాక్షుల‌ను మ‌ళ్లీ పిల‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్న‌ది. అస‌లు హిందూ వివాహాల‌కు స‌ప్త‌ప‌ది ఎందుకు ముఖ్య‌మైన‌దో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ వివాహంలో స‌ప్తప‌ది ఆచారాలు ఖ‌చ్చితంగా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. వివాహం జ‌రిగేట‌ప్పుడు వ‌ధూవ‌రులు ఏడు వాగ్దానాల‌ను చేసుకుంటారు. స‌ప్త‌ప‌దిలో మొద‌టి అడుగు ఆహారం కోసం, రెండ‌వ‌ది బ‌లం కోసం, మూడ‌వ‌ది సంప‌ద కోసం, నాలుగ‌వ‌ది సంతోషం కోసం, ఐద‌వ‌ది కుటుంబం కోసం, ఆర‌వ‌ది ఋతుక్ర‌మం కోసం, ఏడ‌వ‌ది స్నేహం కోసం. వివాహం త‌రువాత భార్యాభ‌ర్త‌లు జీవిత ప్ర‌యాణంలో క‌లిసి ముందుకు సాగాల‌ని మ‌రియు జీవితంలో ప్ర‌తి రంగంలో క‌లిగి ప‌నిచేయాలని ఇది చెబుతుంది.

why 7 steps walk in hindu marriage

అలాగే ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు గౌర‌వించుకోవాలి, ఒక‌రికి ఒక‌రు ప‌ర‌స్ప‌రం స‌హక‌రించుకోవాల‌ని ఇది చెబుతుంది. తద్వారా వారి వైవాహిక జీవితం సంతోషంగా మ‌రియు స‌పన్నంగా ఉంటుంది. ఈ స‌మ‌యంలో వ‌ధూవ‌రులు అనేక మంత్రాల‌ను కూడా ప‌ఠిస్తారు. దీంతో వారికి దేవున్ని ఆశీస్సులు కూడా ల‌భించి వారు కొత్త జీవితాన్ని హాయిగా గడుపుతార‌ని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts