ఇంట్లో మనం సహజంగానే వివిధ రకాల జీవులను పెంచుతుంటాం. వాటిల్లో కుక్కలు కూడా ఒకటి. కొందరు చేపలు, పక్షులు, పిల్లులను కూడా పెంచుతారు. అయితే ఎక్కువ శాతం మంది పెంచుకునేవి మాత్రం కుక్కలే. కుక్కలు మనుషులకు ఎన్నో ఏళ్ల నుంచి విశ్వాసపాత్రంగా మెలుగుతూ వస్తున్నాయి. పూర్వం రోజుల్లో వేటకు వెళ్లినా, పశువులను మేతకు తీసుకెళ్లినా కుక్కలను వెంట తీసుకెళ్లేవారు. అవి వారికి రక్షణగా ఉండేవి. అలా కుక్కలు మనుషులకు అత్యంత దగ్గరయ్యాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనకు పెంచుకునేందుకు అనేక రకాల డాగ్ బ్రీడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కుక్కలను బాగా పరిశీలిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి.
కుక్కలు సాధారణంగా మూత్రం పోసేటప్పుడు కాలును పైకి ఎత్తి ఒక లెవల్‌లో కాలును ఉంచి మూత్రం పోస్తాయి. అలాగే అవి పదే పదే ఒకే చోట మూత్రం పోస్తాయి. అయితే కుక్కలు ఇలాగే మూత్ర విసర్జన ఎందుకు చేస్తాయో తెలుసా. అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుక్కలు ఒకసారి మూత్రం చేసినప్పుడు కాలును ఎత్తి తమ ముక్కుకు సమానంగా ఉండేలా కాలును ఉంచి మూత్ర విసర్జన చేస్తాయి. దీంతో అవి తమ పరిధిని నిర్దేశించుకుంటాయి.
మళ్లీ మూత్ర విసర్జన చేసినప్పుడు వాటికి ముక్కుతో వాసన చూడడం సులభం అవుతుంది. అందుకనే కుక్కలు కాస్త ఎత్తులో మూత్ర విసర్జన చేస్తాయి. తరువాత వచ్చినప్పుడు అవి వాసనను బట్టి తాను అంతకు మూత్ర విసర్జన చేసిన ప్రాంతం అని గుర్తిస్తాయి. దీంతో వెంటనే మళ్లీ అక్కడే అదేవిధంగా మూత్ర విసర్జన చేస్తాయి. ఇక బైకులు, కార్ల టైర్లు అనేక ప్రాంతాల్లో తిరుగుతాయి. వాటి వాసనను మనం సరిగ్గా గుర్తించలేం, కానీ కుక్కలు బాగా పసిగట్టగలవు. బైకులు, కార్ల టైర్ల వాసన పెంట కుప్పలను పోలి ఉంటుంది. కనుకనే కుక్కలు ఆ టైర్లపై మూత్ర విసర్జన చేసేందుకు ఆసక్తిని చూపిస్తాయి. ఇలా కుక్కలను పరిశీలించి మనం అనేక విషయాలను తెలుసుకోవచ్చు.