sports

Cricket : క్రికెట్ మ్యాచ్‌ల‌లో బ్యాట్స్‌మెన్ పిచ్‌ను బ్యాట్‌తో ట‌చ్ చేసి ప‌రిశీలిస్తారు.. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

Cricket : మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు. కొన్ని కోట్ల సంఖ్య‌లో ఈ ఆట‌కు అభిమానులు ఉన్నారు. టీమిండియా ఆడే ప్ర‌తి మ్యాచ్‌ను అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తుంటారు. ఇక ఐపీఎల్ గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యంలో టీఆర్‌పీ రేటింగ్స్ మొత్తం ఆ మ్యాచ్‌ల‌కే వ‌స్తుంటాయి. ఇలా క్రికెట్ ఎంత‌గానో పాపుల‌ర్ అయింది.

అయితే క్రికెట్ మ్యాచ్‌లు ఆడే స‌మ‌యంలో ప్లేయ‌ర్లు.. ముఖ్యంగా బ్యాట్స్ మెన్ మ‌ధ్య మ‌ధ్య‌లో.. పిచ్ మీద‌కు వ‌చ్చి బ్యాట్‌తో పిచ్‌ను ట‌చ్ చేసి చూస్తుంటారు. ఈ విష‌యాన్ని చాలా మంది గ‌మ‌నించే ఉంటారు. అయితే బ్యాట్స్‌మెన్ అలా ఎందుకు చేస్తారో తెలుసా ? దాని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

why batsmen inspect pitch during match

మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో బ్యాట్స్‌మెన్‌లు కొన్ని స‌మ‌యాల్లో పిచ్ మీద‌కు వ‌చ్చి బ్యాట్‌తో పిచ్‌ను ట‌చ్ చేసి వెళ్తుంటారు. పిచ్ మీద ఎక్క‌డైనా ఉబ్బెత్తుగా ప్యాచ్‌లు ఉన్నా.. ర‌ఫ్ ప్యాచ్‌లు ఉన్నా.. బ్యాట్‌తో అలా చేసి వాటిని స‌రి చేస్తారు. ఇక కొంద‌రు బ్యాట్స్‌మెన్ అయితే అవ‌స‌రం లేకున్నా ఎక్కువ సార్లు పిచ్ మ‌ధ్య‌లోకి వ‌చ్చి అలా చేస్తుంటారు. దీంతో బౌల‌ర్ రిథ‌మ్ దెబ్బ తింటుంద‌ని, అత‌ను సరిగ్గా బౌలింగ్ చేయ‌లేడ‌ని.. బ్యాట్స్‌మెన్ భావ‌న‌. అందుకనే బౌల‌ర్ రిథ‌మ్‌ను దెబ్బ తీసేందుకే కొంద‌రు బ్యాట్స్‌మెన్ అలా చేస్తారు.

ఇక కొంద‌రు బ్యాట్స్‌మెన్ అయితే టెన్ష‌న్ కార‌ణంగా ఈ విధంగా చేస్తుంటారు. పిచ్ మ‌ధ్య‌లోకి వ‌చ్చి బ్యాట్‌తో ట‌చ్ చేసి ప‌రిశీలించిన‌ట్లు చేసి ఒత్తిడిని త‌గ్గించుకుంటారు. అలాగే పిచ్ కండిష‌న్ గురించి తెలుసుకునేందుకు కూడా ఇలా చేస్తుంటారు. ఇక ఈ విధంగా బ్యాట్‌తో చేయ‌డాన్ని గార్డెనింగ్ అని క్రికెట్ ప‌రిభాష‌లో అంటారు. బ్యాట్స్‌మెన్ పిచ్ మ‌ధ్య‌లోకి వ‌చ్చి బ్యాట్‌తో గ్రౌండ్‌ను ట‌చ్ చేసి ప‌రిశీలించ‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణాలు ఇవి అని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts