Benches : బెంచిలను అంత ఎత్తులో ఏర్పాటు చేశారేంటి ? దీని వెనుక అసలు కారణం తెలిస్తే హ్యాట్సాఫ్‌ అంటారు..!

Benches : డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్ లో మీరు ఎక్కడ చూసినా ఒక విచిత్రం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో రహదారుల పక్కన బెంచిలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే దాదాపుగా అన్ని బెంచిలు సాధారణంగానే ఉంటాయి. కానీ అక్కడక్కడా కొన్ని బెంచిలు మాత్రం బాగా ఎత్తులో ఉంటాయి. అవును. చిత్రంలో మీరు చూస్తున్నది అలాంటి బెంచిలనే. వీటిని అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి ఎత్తయిన బెంచిలను మొదటిసారిగా చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది. అంత ఎత్తులో బెంచిలను ఎందుకు ఏర్పాటు చేశారు ? మతులు గానీ పోయాయా ఏంటి.. అంత ఎత్తులో బెంచిలు ఉంటే.. వాటిపై ఎలా కూర్చుంటారు.. ఆమాత్రం జ్ఞానం లేకుండా బెంచిలను అలా ఎలా ఏర్పాటు చేశారు.. అని ఎవరికైనా సరే ప్రశ్నలు వస్తుంటాయి. కానీ దీని వెనుక ఎంతో గొప్ప సదుద్దేశం ఉంది. అసలు విషయం తెలిస్తే మీరు కూడా హ్యాట్సాఫ్‌ అని చప్పట్లు కొడతారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

కోపెన్‌హాగన్‌ మాత్రమే కాదు.. పూర్తిగా డెన్మార్క్‌ అంతా సముద్ర మట్టానికి దిగువ భాగంలో ఉంటుంది. అంటే మొత్తం పల్లపు ప్రాంతం అన్నమాట. కేవలం కొన్ని ప్రదేశాలు మాత్రమే అక్కడ సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటాయి. మిగిలిన అన్నీ సముద్ర మట్టానికి దిగువనే ఉంటాయి. ఇలా ఉండడం కారణంగా 2100 సంవత్సరం వరకు పూర్తిగా డెన్మార్క్‌ అంతా నీట మునిగే అవకాశం ఉందని సైంటిస్టులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఏడాదికి సుమారుగా ఒక మీటర్‌ ఎత్తు వరకు అక్కడ సముద్ర మట్టం పెరుగుతోందట. అందువల్ల కొన్నేళ్లకు అక్కడ అంతా సముద్రంలో మునిగిపోతుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఇలా కోపెన్‌హాగన్ లో కొన్ని చోట్ల బెంచిలను ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇదీ.. వాటిని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కారణం.

why Benches are installed at height
Benches

సాధారణంగా అక్కడ ఉండే బెంచిల కన్నా ఈ ఎత్తు బెంచిలను 85 సెంటీమీటర్లు ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేశారు. అంటే ఆ ఎత్తు వరకు కొన్నేళ్ల తరువాత ఆ ప్రాంతం అంతా నీట మునుగుతుందని సులభంగా అర్థమవుతుంది. అందుకనే ఆ బెంచిలను అలా ఏర్పాటు చేశారు. ఇక ఆ బెంచిలను అక్కడి టీవీ2 చానల్‌ వారు ఏర్పాటు చేయగా.. వాటికి ఫ్యూచర్‌ బెంచెస్‌ అని పేరు పెట్టారు. అయితే అక్కడ సముద్ర మట్టం స్థాయిలు అంతలా పెరిగేందుకు ప్రజలే కారణమని.. తీవ్రమైన వాతావరణ కాలుష్యం వల్లే అలా జరుగుతుందని.. కనుక కాలుష్యాన్ని తగ్గించాలని చెబుతూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకే అలా బెంచిలను ఎత్తుగా ఏర్పాటు చేశారు. దీంతో ఆ బెంచిలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వాటిని చూసైనా ప్రజల్లో కాస్త మార్పు వస్తే.. అంతే చాలు కదా.. దీంతో పర్యావరణాన్ని రక్షించిన వారమవుతాం. అలాగే ప్రకృతి విపత్తులు రాకుండా ఉంటాయి. ఏది ఏమైనా వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి వారికి హ్యాట్సాఫ్‌ చెప్పవచ్చు.

Editor

Recent Posts