Bheja Fry : ఎంతో రుచిక‌ర‌మైన భేజా (బ్రెయిన్‌) ఫ్రై.. ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Bheja Fry : మ‌ట‌న్ పేరు చెప్ప‌గానే చాలా మందికి నోట్లో నీళ్లూరుతుంటాయి. మ‌ట‌న్‌తో అనేక ర‌కాల వెరైటీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఏ వెరైటీని చేసినా మ‌ట‌న్ చాలా రుచిగా ఉంటుంది. అయితే కొంద‌రు త‌ల‌కాయ అంటే ఇష్ట‌ప‌డ‌తారు. దాంతోపాటు బ్రెయిన్ కూడా వ‌స్తుంది. దీన్నే భేజా అని కూడా కొంద‌రు అంటుంటారు. దీన్ని ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్ర‌మంలోనే భేజా ఫ్రై ని ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

భేజా ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెయిన్ – 1, నూనె – త‌గినంత‌, ఉల్లిపాయ‌లు – 1 (స‌న్న‌గా త‌ర‌గాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, కొత్తిమీర – ఒక‌టేబుల్ స్పూన్ (స‌న్న‌గా త‌ర‌గాలి), ప‌సుపు – అర టీస్పూన్‌, కారం – ఒక టీస్పూన్‌, ఉప్పు – ఒక టీస్పూన్‌, ధ‌నియాల పొడి – ఒక టీస్పూన్‌.

Bheja Fry very easy to make here is the recipe
Bheja Fry

భేజా ఫ్రై ని త‌యారు చేసే విధానం..

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి నూనె వేసి కాగిన త‌రువాత ఉల్లిపాయ‌లు వేసి రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అందులోనే ప‌సుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత బ్రెయిన్ వేసి వేయించాలి. ఇప్పుడు స్ట‌వ్‌ను సిమ్ లో పెట్టాలి. బ్రెయిన్‌ను కాసేపు వేయించాక అందులో త‌గినంత ఉప్పు, కారం వేసి మ‌ళ్లీ వేయించాలి. త‌రువాత స‌న్న‌ని మంట‌పైనే మూత పెట్టి బ్రెయిన్‌ను 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇది చాలా మృదువుగా ఉంటుంది. క‌నుక చాలా త్వ‌ర‌గా ఉడుకుతుంది. 5 నిమిషాల త‌రువాత ధ‌నియాల పొడి, కొత్తిమీర వేయాలి. ఇంకో నిమిషం పాటు అంతా క‌లిపి బాగా వేయించాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసేయాలి. దీంతో రుచిక‌ర‌మైన భేజా ఫ్రై త‌యార‌వుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.

Editor

Recent Posts