lifestyle

పుట్టిన రోజు నాడు కేక్ ను ఎందుకు క‌ట్ చేస్తారో తెలుసా ?

సాధార‌ణంగా కొంద‌రు పుట్టిన రోజుల‌ను జ‌రుపుకోరు. కానీ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను జ‌రుపుకుంటే మాత్రం క‌చ్చితంగా కేక్‌ను క‌ట్ చేస్తారు. ఇక పిల్ల‌ల కోసం త‌ల్లిదండ్రులు బ‌ర్త్ డే వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తుంటారు. ఆ వేడుక‌ల్లోనూ కేక్‌ల‌ను క‌ట్ చేస్తుంటారు. అయితే పుట్టిన రోజు నాడు కేక్ ల‌ను ఎందుకు చేస్తారో తెలుసా ? అస‌లు ఆ సంప్ర‌దాయం ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మైంది ? ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వ కాలంలో రోమ‌న్లు కేవ‌లం పెళ్లిళ్ల సంద‌ర్భంగా కేక్‌ల‌ను క‌ట్ చేసేవారు పెళ్లి స‌మ‌యంలో వ‌ధూవ‌రులు ఒక‌రి చేతుల‌ను ఒక‌రు ప‌ట్టుకుని కేక్‌ను క‌ట్ చేసేవారు. ఈ సంద‌ర్భంగా ఒక‌రికొక‌రు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌తిజ్ఞ చేసేవారు. అందుకు సూచ‌న‌గా కేక్‌ల‌ను క‌ట్ చేసేవారు. అయితే అప్ప‌ట్లో కేకులు వేరే విధంగా ఉండేవి. వాటిని పిండి, తేనె న‌ట్స్ తో ఒకే పొర‌గా త‌యారు చేసేవారు.

why cake is cut on birth days

ఇక 15వ శ‌తాబ్దంలో ఆ సంప్ర‌దాయం జ‌ర్మ‌నీకి వ్యాప్తి చెందింది. వారు త‌మ పిల్ల‌ల పుట్టిన రోజు వేడుక‌ల్లో కేక్‌ను క‌ట్ చేసేవారు. అవి కూడా ఇంచు మించు రోమ‌న్ల కేక్‌ల మాదిరిగానే ఉండేవి. కేక్‌ను క‌ట్ చేయ‌డం వ‌ల్ల త‌మ పిల్ల‌ల‌కు మంచి జ‌రుగుతుంద‌ని వారు విశ్వసించే వారు.

అయితే 17, 18వ శ‌తాబ్దాల్లో పారిశ్రామిక రంగంలో వ‌చ్చిన విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు, ప్ర‌పంచీక‌ర‌ణ వ‌ల్ల కేకుల‌ను క‌ట్ చేయ‌డం అనేది దాదాపుగా అన్ని దేశాల‌కు విస్త‌రించింది. కానీ మొద‌ట్లో కేవ‌లం ధ‌నికులు మాత్ర‌మే త‌మ ద‌ర్జా కోసం కేక్‌ల‌ను క‌ట్ చేసేవారు. అయితే నెమ్మ‌దిగా ఆ సంప్ర‌దాయం మ‌రింత‌గా విస్త‌రించింది. దీంతో ఇప్పుడు అంద‌రూ కేక్ ల‌ను క‌ట్ చేస్తున్నారు. కేవ‌లం బ‌ర్త్ డేల‌కే కాకుండా ఇత‌ర శుభ కార్యక్ర‌మాల‌కు కూడా ప్ర‌స్తుతం కేక్‌ల‌ను క‌ట్ చేస్తున్నారు. కానీ మొద‌ట్లో అయితే పెళ్లిళ్ల‌లోనే కేక్‌ల‌ను క‌ట్ చేసేవారు. ఇవీ.. కేక్‌ల‌ను క‌ట్ చేయ‌డం వెనుక ఉన్న కార‌ణాలు..!

Admin

Recent Posts