చాలా శాతం మందికి సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా వేడిగా ఉన్నప్పుడు లేక దాహంగా ఉన్నప్పుడు వేసవికాలంలో వీటిని ఎక్కువ మంది తాగుతూ ఉంటారు. అయితే ఇవి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పవచ్చు, పార్టీలలో సర్వ్ చేయడానికి సాఫ్ట్ డ్రింక్స్ కామన్. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టపడతారు.
ఎప్పుడైనా సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ ని గమనించారా? షాపింగ్ కి వెళ్ళినప్పుడు లేక గ్రాసరీ స్టోర్స్ లో కూల్ డ్రింక్ బాటిల్స్ ను మీరు చూసినట్లయితే బాటిల్ అడుగు భాగం కంటే పై భాగం ఫ్లాట్ గా ఉంటుంది. కానీ కింది భాగం మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. పైగా బంప్ కూడా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే..? బాటిల్ యొక్క బలం అలాగే దృఢత్వాన్ని పెంచడానికి ఇలా బంప్ ని ఇస్తారు. దీని వలన కూల్ డ్రింక్ వాల్యూమ్ మారినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కూల్ డ్రింక్ చల్లగా ఉన్నప్పుడు వాల్యూమ్ మారుతూ ఉంటుంది. అయితే బంప్ యొక్క చివరి భాగం కాస్త ఎక్స్పాండ్ అవుతుంది. ఎలాంటి బ్రేకేజ్ అవ్వకుండా వాల్యూమ్ మారినా కూడా బాటిల్ తట్టుకోగలుగుతుంది. ప్రెషర్ లో మార్పులు వచ్చినా సరే బాటిల్ తట్టుకోవడానికి ఈ బంప్ ని కింద ఇస్తారు. పైగా పైన ఫ్లాట్ గా ఉండి కింద స్ట్రాంగ్ గా ఉండడం వలన బాటిల్ పగిలిపోయే అవకాశం ఉండదు.