lifestyle

Closing Eyes While Kissing : ముద్దు పెట్టుకునే స‌మయంలో క‌ళ్ల‌ను ఎందుకు మూసుకుంటారు..?

Closing Eyes While Kissing : ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు జీవిస్తున్నాయి. వాటిలో మానవుడు కూడా ఒక జాతికి చెందుతాడు. అయితే మనిషి తప్ప ఏ ఇతర జీవరాశి అయినా తన ప్రేమను, ఆప్యాయతను ఇతర జీవుల పట్ల ఎలా పంచుకుంటుంది..? జంతువులైతే తమ ముక్కులను ఒకదానితో ఒకటి రాసుకుని ప్రేమను కనబరుస్తాయి. అదే మనిషి విషయానికి వస్తే ఆయా ప్రాంతాల వ్యవహార శైలులకు అనుగుణంగా కొందరు ఆప్యాయంగా కావలించుకుంటారు. మరికొందరు ముద్దు పెట్టుకుని తమ అభిమానాన్ని ఇతరుల పట్ల చాటుకుంటారు. అయితే ఎవరైనా ముద్దు పెట్టుకున్నప్పుడు మీరో విషయం గమనించారా? అదేనండీ, ముద్దు పెట్టుకునే వారు కచ్చితంగా కళ్లు మూసుకునే ముద్దు పెట్టుకుంటారు. అవును, ఇది నిజమే. అయితే ఎవరైనా కళ్లు మూసుకునే ఎందుకు ముద్దు పెట్టుకుంటారు? అది తెలుసుకోవాలంటే దీన్ని చదవండి..

ముద్దు పెట్టుకోవడమనేది ఒకరికి మరొకరిపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. మనం సాధారణంగా ఏదైనా ఒక పనిచేస్తూ మరో పని చేయలేం. ఏదైనా కేవలం ఒక పనిపై మాత్రమే మనం శ్రద్ధ వహించగలం. సరిగ్గా ఇదే సూత్రం ముద్దుకు కూడా వర్తిస్తుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్లు తెరిచి ఉంచితే మనం దానిపై సరిగ్గా దృష్టి పెట్టలేం. దీంతో కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ముద్దు పెట్టుకునే సందర్భంలో మన కళ్లు ఆటోమేటిక్‌గా అవే మూతపడిపోతాయి. మెదడు ఆవిధంగా కళ్లను ఆపరేట్ చేస్తుంది.

why we close eyes when kissing

 

ఇంకో విషయమేమింటే కళ్లు తెరిచి ముద్దు పెట్టుకుందామనుకున్నా అలా చేయలేమట. ఒక వేళ బలవంతంగా కళ్లు తెరిచి ముద్దు పెట్టుకున్నా అది రొమాంటిక్‌గా ఉండదట. ఈ క్రమంలో అసలైన ముద్దు మజాను అనుభవించాలంటే తప్పనిసరిగా కళ్లు మూయాల్సిందేనట. అందుక‌నే ఎవ‌రైనా స‌రే ముద్దు పెట్టుకున్న‌ప్పుడు స‌హ‌జంగానే క‌ళ్లు మూస్తారు. ఇదీ.. దాని వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం.

Admin

Recent Posts