lifestyle

ఫెవికాల్‌ డబ్బాలో ఉండే గమ్‌ లోపల డబ్బాకు ఎందుకు అతుక్కోదు ? కారణం తెలుసా ?

ఫెవికాల్‌ గమ్‌ తెలుసు కదా. ఒకప్పుడు యాడ్స్‌ ద్వారానే ఈ కంపెనీ బాగా పాపులర్‌ అయింది. ఫెవికాల్‌ గమ్‌ అంటే అంత ప్రాముఖ్యత ఉండేది. ఆ గమ్‌ తెల్లగా ఉంటుంది. డబ్బాల్లో విక్రయిస్తారు. అయితే డబ్బాల్లో ఉండే ఆ గమ్‌ డబ్బాకు ఎందుకు అతుక్కోదు ? దాన్ని బయటకు తీసి వాడితేనే ఎందుకు అతుక్కుంటుంది ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఫెవికాల్‌ వంటి గమ్‌ల తయారీలో పాలిమర్‌లను ఉపయోగిస్తారు. ఆ గమ్‌లో కొంత శాతం నీరు ఉంటుంది. అందువల్లే గమ్‌ ద్రవ రూపంలో ఉంటుంది. అయితే ఆ గమ్‌ను బయటకు తీసి దేనిపై అయినా రాస్తే అందులో ఉండే నీరు ఆవిరవుతుంది. దీంతో గమ్‌ గట్టిపడుతుంది. తరువాత అది రాయబడిన ఉపరితలానికి అంటుకుంటుంది. ఇలా గమ్‌ పనిచేస్తుంది.

అయితే గమ్‌ డబ్బాలో ఉన్నప్పుడు మూత పెట్టి ఉంటాం కదా. కనుక అందులో ఉండే నీరు ఆవిరై పోదు. అలాగే ఉంటుంది. దీంతో గమ్‌ ఎప్పుడూ అలా ద్రవ రూపంలోనే ఉంటుంది. అందువల్లే ఆ గమ్‌ డబ్బాకు అంటుకోదు. ఇదీ.. అసలు విషయం.

Admin

Recent Posts