సాధారణంగా కుక్కలు.. పెంపుడువి అయినా.. ఊర కుక్కలు అయినా ఆ ప్రాంతంలో ఎవరైనా కొత్తగా కనిపిస్తే అరుస్తాయి. అయితే ఇది సహజమే. కానీ అన్ని కుక్కలు మాత్రం సాధారణంగా రాత్రి పూట ఎక్కువగా అరుస్తుంటాయి. అయితే కుక్కలు ఇలా రాత్రి పూటే ఎక్కువగా ఎందుకు అరుస్తాయి ? పగటి పూట అంత ఎందుకు అరవవు ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందా. కుక్కలకు గ్రహణ శక్తి చాలా ఉంటుంది. తమ చుట్టు పక్కల పరిసరాల్లో ఏం జరుగుతుందో అవి బాగా అర్థం చేసుకోగలవు. మనిషికి వినబడని శబ్ద తరంగాలు కూడా కుక్కలకు వినిపిస్తాయి. అందువల్ల ఏ చిన్న శబ్దం అయినా కుక్కలు అలర్ట్ అవుతాయి.
రాత్రి పూట నిర్మానుష్యంగా ఉంటుంది కనుక చిన్న శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక కుక్కలకు ఇంకాస్త ఎక్కువగానే బాగా స్పష్టంగా వినబడుతుంది. అందుకని అవి రాత్రి పూట ఏ చిన్న అలికిడి అయినా, శబ్దం వచ్చినా వెంటనే అరుస్తాయి. రాత్రి పూట కుక్కలు ఎక్కువగా అరిచేందుకు వెనుక ఉన్న కారణాల్లో ఇది ప్రధానమైందని చెప్పవచ్చు.
ఇక కుక్క రాత్రిపూట బాగా అరుస్తుందంటే అది బాధలో ఉందని అర్థం. అలాగే శారీరకంగా ఏదైనా ఇబ్బందిగా ఉంటే రాత్రి పూట కుక్కలు అరుస్తాయి. అయితే రాత్రి పూట కుక్క ఏడ్వడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. దీని వల్ల ఆ ఇంట్లోని కుటుంబ పెద్దకు మరణ హాని కలుగుతుందని అంటారు. ఇక కుక్కలు రాత్రి పూట ఏడ్చేందుకు ఉన్న మరో కారణం ఏమిటంటే.. అవి తమ పరిధిని నిర్ణయించుకునేందుకు ఇతర కుక్కలకు అలా అరిచి చెబుతాయన్నమాట. అలాగే ఇతర కుక్కలను అలర్ట్ చేసేందుకు కూడా రాత్రి పూట అవి ఎక్కువగా అరుస్తాయి. అలాగే తనకు వాతావరణం నచ్చకపోయినా, ఇంకేవైనా నచ్చకపోయినా రాత్రి పూట అవి ఎక్కువగా అరుస్తుంటాయి. ఇలా కుక్కలు రాత్రి పూట అరవడం వెనుక పలు కారణాలు ఉంటాయన్నమాట.