వినోదం

Theatre Seats : చాలా థియేటర్స్ లో I, O Row Seats ఉండవు.. ఎందుకో తెలుసా.? కారణం ఇదే.!

Theatre Seats : అభిమాన న‌టీన‌టుల‌కు చెందిన సినిమాల‌ను చూడ‌డం అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. క‌చ్చితంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఫేవ‌రెట్ స్టార్ సినిమాల‌ను చూసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఇక అలాంటి సంద‌ర్భంలో ఫ్యామిలీతో వెళ్తే అదోర‌క‌మైన అనుభూతి ఉంటుంది. ఫ్రెండ్స్‌తో వెళితే ఎంజాయ్ ఉంటుంది. ఎలా ఉన్న‌ప్ప‌టికీ సినిమా చూడ‌డం అంటే చాలా మంది ఎగిరి గంతేస్తారు. అయితే ఇది స‌రే.. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. మీరు థియేట‌ర్స్‌లో టిక్కెట్ల బుకింగ్ స‌మ‌యంలో ఒక విష‌యం గ‌మ‌నించారా.. అదేనండీ.. థియేటర్‌లో సీట్లు అన్నీ A నుంచి మొద‌లు పెడితే P వ‌ర‌కు ఉంటాయి క‌దా. అయితే వాటిల్లో రెండు అక్ష‌రాల‌కు సంబంధించిన సీట్లు మిస్ అయ్యాయి. గ‌మ‌నించారా.

అవును క‌రెక్టే క‌దా. థియేట‌ర్‌లో I, O అక్ష‌రాల‌తో సీట్లు లేవు. గ‌మ‌నించారా. అయితే అలా ఆ అక్ష‌రాల‌తో సీట్ల‌ను ఎందుకు ఇవ్వ‌లేదో తెలుసా..? ఏమీ లేదండీ.. సాధార‌ణంగా I అక్ష‌రం అంటే అది 1 అంకెను పోలి ఉంటుంది క‌దా. దీంతో దాన్ని 1 అనుకుంటారని వారు I అక్ష‌రంతో సీట్ల‌ను ఇవ్వ‌లేదు. ఇదీ దాని వెనుక ఉన్న రీజ‌న్‌.

why i and o seats not available in theatres

అది క‌రెక్టే. మ‌రి O అక్ష‌రంతో సీట్ల‌ను ఎందుకు పెట్ట‌లేదు. అంటే.. అది కూడా సేమ్ రీజ‌నే. O అక్ష‌రం 0 (సున్నా)ను పోలి ఉంటుంది. దీంతో ఈ అక్ష‌రం ప‌ట్ల కూడా క‌న్‌ఫ్యూజ్ అవుతార‌ని ఆ అక్ష‌రంతో సీట్ల‌ను ఇవ్వ‌లేదు. ఇవీ.. ఆ రెండు అక్ష‌రాల‌తో సీట్ల‌ను ఇవ్వ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలు. కాబ‌ట్టి తెలుసుకున్నారు క‌దా. క‌నుక ఈ అక్ష‌రాల‌తో సీట్లు ఎందుకు లేవు అని ఇక ఆలోచించ‌కండి.

Admin

Recent Posts