వినోదం

Vijaya Shanti : విజయశాంతి పిల్లల్ని కనకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

Vijaya Shanti : చిన్నవయసులోనే వెండి తెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. గ్లామరస్ పాత్రలతో మొదలై.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన హీరోయిన్. ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి. నేటి భారతం తర్వాత విజయశాంతి ప్రస్థానం ప్రతి హీరోయిన్ కుళ్లుకునేలా సాగిందంటే అతిశయోక్తి కాదు. అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది. ఓసేయ్ రాములమ్మా సినిమాతో ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసి.. అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డుల‌నూ బద్దలు కొట్టింది.

సినిమాలకు గుడ్ బై చెప్పాక రాములమ్మ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాతో చాలారోజుల త‌ర్వాత స్క్రీన్ పై కనిపించింది లేడీ సూపర్ స్టార్. అందుకే ఆ మధ్య మీడియా ముందు ఎక్కువగా కనిపించింది. త‌న జీవితంలో జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల గురించి మ‌నసు విప్పి మాట్లాడింది విజ‌య‌శాంతి. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడు బయట పెట్టలేదు. కానీ ఈ మధ్య కొన్ని విషయాలు తెలిశాయి. విజయ శాంతి భర్త పేరు శ్రీనివాసరావు ప్రసాద్. విజయశాంతి తండ్రి పేరు కూడా అదే కావడం విశేషం. అందుకే ఆమె తన భర్తను నాన్న అంటే.. ఆయన ఆమెను చిన్ని అని పిలుస్తారు.

why vijayashanthi did not get kids

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. శ్రీనివాసరావు హీరో బాలకృష్ణకు బంధువట. ఆయన దగ్గర ఉండి చాలాకాలం ఆయన సినిమా వ్యవహారాలు కూడా చూసుకున్నారంట. అయితే తనతోపాటు త‌న భర్తకు కూడా పిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పిన విజయశాంతి ఉద్యమం, పార్టీలాంటివి మొద‌లు పెట్టిన త‌ర్వాత పిల్లల్ని కనాలనిపించలేదని చెప్పుకొచ్చింది. అప్ప‌ట్నుంచి త‌న‌కు ప్రజలే పిల్ల‌ల‌ని చెప్పుకొచ్చింది విజ‌య‌శాంతి. ఒక‌వేళ పిల్లలు పుడితే.. తాను వాళ్ల కోస‌మే ఎక్కువ స‌మ‌యం కేటాయించాల్సి వ‌స్తుంది.. స్వార్థం కూడా పెరిగిపోతుంద‌ని పిల్లల్ని వ‌ద్ద‌నుకున్నామ‌ని సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట పెట్టింది లేడీ సూప‌ర్ స్టార్.

Admin

Recent Posts