information

W-L Meaning : రైల్వే ట్రాక్ పై W/L అని రాసి ఉంటుంది.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

W-L Meaning : మనం రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కిటికీ లోంచి బయటకు చూస్తే ఆ ట్రాక్ పక్కన బోర్డులకు అనేక రకాల రాతలతో కొన్ని సింబల్స్ ఉంటాయి. అవి ఎందుకు పెడతారో మనలో చాలా మందికి తెలియదు. కానీ వాటికి కూడా కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. భారతీయ రైల్వే దీన్ని ట్రాక్ ల పై ఉన్నటువంటి క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేస్తుంది. ఆ క్రాసింగ్ పక్కన ఒక బోర్డు ఉంటుంది. దానిపై W/L అని రాసి ఉంచుతారు. ఇందులో W/L అంటే విజిల్ లెవెల్ బోర్డ్ అని అర్థం వ‌స్తుంది. ఇది రైల్వే ట్రాక్ కు రెండు వైపులా ఉంటుంది.

భారత రైల్వే అధికారిక వెబ్ సైట్ లో చూస్తే లోకో పైలెట్ లను అప్రమత్తం చేయడం కోసమే ఈ బోర్డును ఏర్పాటు చేస్తుంది రైల్వే శాఖ. ఇది క్రాసింగ్ రెండువైపులా అమర్చబడి ఉంటుంది. దీని దాటడానికి 600 మీటర్ల ముందే ఈ బోర్డు ఏర్పాటు చేస్తారు. దీనిగుండా రైల్వే పైలెట్ వెళ్తున్నప్పుడు హార‌న్‌ ఇవ్వడం తప్పనిసరి. ఆ బోర్డు దాటేవరకూ నిరంతరంగా హార‌న్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం క్రాసింగ్ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే ఆ రైలు వస్తున్నట్టు హారన్ మోగించడం. అందుకే W/L బోర్డును ఏర్పాటు చేస్తారు.

wl in railway what is the meaning of it

ఇక ఆ పసుపు రంగు బోర్డుపై W/L అని నలుపు రంగు తో రాయబడి ఉంటుంది. ఇలా ఈ కలర్ ను వాడడం వల్ల చాలా దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. అలా దూరం నుంచి కనిపించినప్పుడు లోకో పైలట్ హారన్ ను కొట్టడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీని ప్రధానార్థం. ఈ బోర్డును ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ అనేక నిబంధనలు పెట్టింది. ఇది నేల నుండి 2100 మిల్లీ మీటర్ల ఎత్తులో ఉండాలి.. 2 బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఒకటి ఇంగ్లీషు. రెండవది హిందీలో రాసి ఉంటుంది.

Admin

Recent Posts